Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కెనడాలో దారుణం… గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో భారతీయ విద్యార్థి మృతి

కెనడాలో దారుణం… గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో భారతీయ విద్యార్థి మృతి
జులై 9 న ఒంటారియో ప్రావిన్స్ లో ఘటన
మిస్సిసాగా ప్రాంతంలో చివరి సంవత్సవరం విద్యాభ్యాసం చేస్తున్న గుర్విందర్
పిజ్జా డెలివరీ బాయ్ గా పార్ట్ టైమ్ ఉద్యోగం
పిజ్జా ఆర్డర్ చేసి, గుర్విందర్ పై దాడి చేసి వాహనం ఎత్తుకెళ్లిన దుండగులు
చికిత్స పొందుతూ గుర్విందర్ కన్నుమూత
కుటుంబంలో విషాదం …ఈనెల 27 భౌతిక దేహాన్ని ఇండియా కు తరలించే ప్రయత్నం…

ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్నత విద్యాభ్యాసం కోసం కెనడా కు వెళ్లి అక్కడ పీజీ విద్య చదువుతూనే పిజ్జా బాయ్ గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న భారత విద్యార్ధి గుర్విందర్ నాథ్ ఆగంతకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించడం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది . భారతీయ విద్యార్థులకు ఇది ఒక హెచ్చరికలా మిగిలింది .కెనడా దేశంలో అనేక దేశాలకు చెందిన విద్యార్థులు చదువు, ఉద్యోగాలకోసం వస్తుంటారు . ప్రశాంత జీవనానికి మారుపేరుగా చెప్పబడుతున్న కెనడాలో ఇలాంటి సంఘట జరగటంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

కెనడాలో దారుణం చోటుచేసుకుంది. ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయ విద్యార్థి గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో మృతి చెందాడు. ఒంటారియో ప్రావిన్స్ లోని పీల్ రీజియన్ లో క్రెడిట్ వ్యూ రోడ్ లో జరిగింది ఈ ఘటన .

దాడి జరిగిన కొద్దిసేపటికే ఓల్డ్ క్రెడిట్‌వ్యూ మరియు ఓల్డ్ డెర్రీ రోడ్‌ల పరిసరాల్లో నాథ్ వాహనం పాడుబడినట్లు కనుగొనబడింది. స్థానిక ఇన్స్పెక్టర్ కింగ్ చెప్పినట్లుగా నేరం జరిగిన ప్రదేశం నుండి ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది.స్థానికులు నాథ్ కు సహాయం చేసేందుకు ప్రయత్నించారు .ట్రామా సెంటర్ కు హుటాహుటిన గాయపడిన నాథ్ ను చికిత్స నిమిత్తం తరలించారు .చికిత్స పొందుతూ నాథ్ జులై 14 తేదీన మరణించారు .

24 ఏళ్ల గుర్విందర్ నాథ్ కెనడాలోని మిస్సిసాగాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. పార్ట్ టైమ్ గా పిజ్జా డెలివరీ బాయ్ గానూ పనిచేస్తున్నాడు. చివరి సెమిస్టర్ కు సిద్ధమవుతున్న గుర్విందర్… చదువు పూర్తికాగానే సొంతంగా పిజ్జా షాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇటీవల ఓ పిజ్జా ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన గుర్విందర్ పై కొందరు వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి అతడి వాహనాన్ని ఎత్తుకెళ్లారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 14న కన్నుమూశాడు. దాడిలో గుర్విందర్ తల, ఇతర శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.

కాగా, గుర్విందర్ నుంచి వాహనాన్ని ఎత్తుకెళ్లాలన్న పక్కా ప్లాన్ తోనే దుండగులు పిజ్జా ఆర్డర్ చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. కాగా, దుండగులు దాడి జరిగిన ప్రదేశానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గుర్విందర్ వాహనాన్ని వదిలేశారు.

త్వరలోనే దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (CBC) తెలిపిన వివరాల ప్రకారం , టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా,ఈ నెల 27న భారత్ తరలించనున్నారు. గుర్విందర్ నాథ్ మరణించిన నేపథ్యంలో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది…

Related posts

దావోస్ సదస్సుకు హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్

Ram Narayana

గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

Drukpadam

ఏపీ విశ్రాంత ఐఏఎస్‌కు జైలు శిక్ష విధించిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment