Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కమ్యూనిస్టులపై మంత్రి హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు …కూనంనేని ఆగ్రహం


హరీశ్ రావు! మునుగోడులో మేం లేకుండానే గెలిచారా? అంటూ నిలదీత
కమ్యూనిస్టులకు కార్యకర్తలు లేరన్న మంత్రి హరీశ్ రావు
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కూనంనేని సాంబశివరావు
గుండెపై చేయి వేసుకొని హరీశ్ రావు ఆ వ్యాఖ్యలు చెప్పాలని నిలదీత

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ యస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా సభలోకి అడుగు పెట్టాలని కలలు కన్న కమ్యూనిస్టులకు మంత్రి హరీష్ రావు మాటలు ఆగ్రహం తెప్పించాయి. కమ్యూనిస్టులకు కార్యకర్తలు లేరని మంత్రి హరీష్ అనడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు .కమ్యూనిస్టులతో పొత్తు ఉండాలా లేదా అనేది మీ ఇష్టం… కానీ కమ్యూనిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు .కమ్యూనిస్టుల చరిత్ర తెలిసిన వారు ఎవరు ఇలా మాట్లాడారని అన్నారు .మునుగోడు ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టుపార్టీల దగ్గరకు వచ్చి మద్దతు ఇవ్వాలని కోరితే బీజేపీని వ్యతిరేక వైఖరితో బీఆర్ యస్ ఉందని మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు .మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఓట్లు లేకపోతె బీఆర్ యస్ గెలిచేదా ..?అని సాంబశివరావు మంత్రి హరీష్ రావు ను నిలదీశారు .మునుగోడు ఎన్నికల్లో బీఆర్ యస్ విజయం తర్వాత మా కార్యాలయాలకు వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు పొత్తును కొనసాగిద్దామని అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేద్దామని ,మీరు లేకపోతె మునుగుడులో మేము గెలిచేవాళ్ళం కాదని చెప్పిన విషయాలు మరవద్దని అన్నారు . బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటం కొనసాగుతుంది. దానిపైనా ఎలాంటి రాజీలేదని పేర్కొన్నారు .

మంత్రి హరీశ్ రావు కమ్యూనిస్ట్ పార్టీలను చులకన చేసి మాట్లాడటం దేనికి సంకేతమనే చర్చలు ప్రారంభం అయ్యాయి. సీపీఐ పార్టీ నేత కూనంనేని సాంబశివరావు ఘాటుగా స్పందించారు . కమ్యూనిస్ట్ పార్టీలకు మనుషులు లేరు.. కార్యకర్తలు లేరని మంత్రి ఎద్దేవా చేయడంపై మండిపడ్డారు . ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంకరం అని కూనంనేని అన్నారు . కమ్యూనిస్టులు లేకుండానే మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడా? అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను హరీశ్ రావు గుండెపై చేయి వేసుకొని చెప్పాలన్నారు.

కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్… బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన స్వల్ప మెజార్టీతో గెలిచిన విషయం విదితమే … అయితే ఈ గెలుపుకు కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతివ్వడమే కారణమనే వాదనలు ఉన్నాయి. బీఆర్ యస్ నేతలు కూడా దీన్ని అంగీకరించారు . బీఆర్ఎస్ కు వచ్చిన మెజార్టీ అంతా కమ్యూనిస్ట్ ఓట్ల కారణంగానే వచ్చిందని ఒప్పుకున్నారు . కమ్యూనిస్టులు బీఆర్ యస్ తో కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని ఉద్దేశంతో పలుమార్లు అధినేత కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం కబురు చేశారు . ఇదిగో ,అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు . కమ్యూనిస్టులతో బీఆర్ యస్ కలవడానికి సిద్ధంగా లేదని వారిని వదిలించుకోవాలని అనుకుంటుందని బీఆర్ యస్ నాయకులు నుంచి వినిపిస్తున్న మాటలు …దానికి తగ్గట్లుగానే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయి . అధినేత అనుమతి లేకుండా మంత్రులు అయినా , నేతలైన రాజకీయపరమైన మాటలు మాట్లాడారు …అందువల్ల ఇక ఆలోచించుకోవాల్సింది కమ్యూనిస్టులే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ..

Related posts

పోలింగ్ కోసం సర్వం సిద్ధం …ఖమ్మం కలెక్టర్ ,పోలీస్ కమిషనర్!

Drukpadam

రాజదండం.. తొలి రోజే వంగిపోయింది: కేంద్ర ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు

Drukpadam

భద్రాద్రి మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం -పులకించిన భక్త జనం!

Drukpadam

Leave a Comment