ఆంధ్రప్రదేశ్

చంద్రబాబును కలిసిన మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు

  • హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో కలిసిన దంపతులు
  • మర్యాదపూర్వకంగా కలిసిన మనోజ్-మౌనిక
  • ఇటీవలే పెళ్లి చేసుకున్న మనోజ్-భూమా మౌనిక

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ దంపతులు కలిశారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత నివాసానికి మనోజ్, మౌనిక వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమాలకు చాలాకాలం గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ ఇటీవలే భూమూ మౌనికను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా, మనోజ్ దంపతులు… చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నాయకురాలు. గత టీడీపీ హయాంలో ఆమె మంత్రిగా కూడా పని చేశారు.

2019 ఎన్నికల్లో మనోజ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని, వైసీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలో మంచు కుటుంబం వైసీపీలోనే ఉంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈయన టీడీపీ అధినేతను కలవడం గమనార్హం.

Related posts

అమరావతిలో క్వాంటం వ్యాలీ… శంకుస్థాపన …

Ram Narayana

వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే!.. హోలీ వేడుక‌ల్లో మందు బాటిళ్ళతో చిందులు…

Drukpadam

బరువు తగ్గిపోయి, షుగర్ పెరిగిపోతుంటే.. పాంక్రియాటిక్ కేన్సర్ కావచ్చు!

Drukpadam