Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీటీడీ కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం…!

  • ఈ నెల 8న ముగుస్తున్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం
  • టీటీడీ ఛైర్మన్ గా రెండో సారి బాధ్యతలను చేపట్టనున్న భూమన
  • ప్రస్తుతం టీటీడీలో ఛైర్మన్ సహా 35 మంది పాలకమండలి సభ్యులు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఆయన టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8న ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేశారు. ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం ఇది ఆయనకు రెండోసారి. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 నుంచి 2008 మధ్య ఆయన ఛైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం టీటీడీలో ఛైర్మన్ సహా 35 మంది పాలకమండలి సభ్యులు ఉన్నారు.

ఆయన హయాంలో టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది జంటలకు కళ్యాణ్ జరిపించారు .స్థానికుడే కావడం వల్ల అక్కడ ఆయనకు మంచి పట్టు ఉంది. టీటీడీ చైర్మన్ పదవి కోసం అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ చివరకి సీఎం జగన్ మోహన్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపడం గమనార్హం…ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి , ఎమ్మెల్యే పొలుసు పార్థసారధి ,ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దారాఘవరావు పేర్లు పరిశీలించారు .చివరకు భూమన కరుణాకర్ రెడ్డిని ఎంపిక చేశారు .అయితే బోర్డు సభ్యులను నియమించాల్సి ఉంది . ఇందులో ఎవరెవరిని నియమిస్తారో చూడాలి మరి …!

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వైవీ సుబ్బారెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2019 జూన్ 22న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా తొలిసారి ప్రభుత్వం నియమించింది. తిరిగి 2021 జూన్ 22న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా పదవీ కాలం ముగియడంతో తిరిగి ఆయనకే రెండోసారి టీటీడీ చైర్మన్‌ బాధ్యతలను అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2021 ఆగష్టు 8న వైవీ సుబ్బారెడ్డి రెండవసారి టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో రెండు దఫాలుగా వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా మరో రెండు రోజుల్లో టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో టీటీడీ తదుపరి చైర్మన్‌ ఎవరు దానిపై ఆసక్తికర చర్చ జరిగింది. చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికే ఆ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.

Related posts

హెల్త్‌హబ్‌గా వరంగల్ …తెలంగాణ సర్కార్ నిర్ణయం…

Drukpadam

కేంద్ర ప్రభుత్వ వైఖరే మా వైఖరి …విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం!

Drukpadam

అత్యవసర ఫిర్యాదులకు ఇక డయల్ 112.. దేశవ్యాప్తంగా ఒకటే నంబర్

Drukpadam

Leave a Comment