Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

శివలింగం తొలగించాలని తీర్పు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడంతో తీర్పు వెనక్కు తీసుకున్న జడ్జి!

  • కలకత్తా హైకోర్టులో భూవివాదం కేసులో అనూహ్య పరిణామాలు
  • వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన శివలింగం 
  • దాన్ని తొలగించాలంటూ న్యాయమూర్తి తీర్పు
  • తీర్పు నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్  రిజిస్ట్రార్‌కు అకస్మాత్తుగా మూర్ఛ
  • వెంటనే తీర్పును ఉపసంహరించుకున్న న్యాయమూర్తి
  • దిగువ కోర్టులో తేల్చుకోవాలంటూ పిటిషనర్లకు సూచన

ఓ వివాదాస్పద స్థలంలోని శివలింగం తొలగించాలంటూ ఆదేశించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఆ మరుక్షణమే తన తీర్పును వెనక్కు తీసుకున్నారు. దీంతో, జడ్జి నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించగా ఈ ఘటన వెనుక సుదీప్ మండల్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోవింద్ హైకోర్టును ఆశ్రయించారు.

 విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు. అనంతరం, శివలింగం తొలగించాలంటూ తీర్పు వెలువరించారు. అయితే, జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి తన తీర్పును ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా, ఈ వివాదంపై హైకోర్టు కలుగజేసుకోదని, కింది కోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించారు.

Related posts

ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరుపై సీఐడీకి న్యాయమూర్తి ప్రశ్న

Ram Narayana

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై భిన్నాభిప్రాయాలు.. సీజేఐకు నివేదించిన ద్విసభ్య ధర్మాసనం

Ram Narayana

స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు

Ram Narayana

Leave a Comment