Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఆందోళనలు .. ట్రాఫిక్ జామ్ , అరెస్టులతో అట్టుడుకిన ఖమ్మం ….

ఖమ్మంలో ఉద్రిక్తత …మూడు చోట్ల ఆందోళనతో పోలిసుల ఉక్కిరి బిక్కిరి…
మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి లో సెకండ్ ఏ ఎన్ ఎం ల అరెస్ట్
రోడ్ నిర్మాణంలో పక్షపాతం పై కాంగ్రెస్ మండిపాటు
మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి ..పోలీసులతో వాగ్వివాదం అరెస్టులు
సూర్యాపేటలో మంత్రి ప్రోద్బలంతో డీసీఎంస్ చైర్మన్ పై ఒక్కరోజే 71 పెట్టడంపై ఖమ్మం లో యాదవుల రాస్తారోకో …బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ జామ్

ఖమ్మంలో మంగళవారం మూడు చోట్ల ఒకేసారి జరిగిన వివిధ ఆందోళనపై ఉద్రిక్తిత ఏర్పడింది…దీంతో పోలీసులు ఉక్కిరి బిక్కరి అయ్యారు…సెకండ్ ఏ ఎన్ ఎం లను పర్మినెంట్ చేయాలనీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేసిన ఏ ఎన్ ఎం లను పోలీసులు అడ్డుకున్నారు .క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నం చేసిన మహిళా ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ..

ఖమ్మంలోని 54 వ డివిజన్ పరిధిలో ఉన్న వి డి ఓస్ కాలనీ లో ఏ సి పి కార్యాలయం నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కార్యాలయం ప్రజాభవన్ వరకు 30 అడుగుల సి సి రోడ్ వేయాల్సి ఉండగా కేవలం 12 అడుగులు మాత్రమే వేయడాన్ని స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ప్రశ్నించి అడ్డుకున్నారు . ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో శంకుస్థాపనకు సైతం ఆమెను పిలవకుండా ప్రోటోకాల్ పాటించకవపోవడం అప్రజాస్వామికమని ఆమె ఆరోపించారు . అంటే కాకుండా 30 అడుగుల రోడ్ ను 12 అడుగులు వేయడంపై అభ్యంతరం చెప్పారు . దీంతో కాంగ్రెస్ నేతలు కార్పొరేటర్లు వచ్చి పనులను అడ్డగించారు . రోడ్ పై బైఠాయించారు . మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా నిరసన కార్యక్రంలో పాల్గొన్నారు. మంగళవారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు వచ్చి కార్పొరేషన్ ఆఫీస్ ను ముట్టడించారు .దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులకు , కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకుల, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నది . ఇదేమైనా పల్లెటూరు అనుకున్నారా …? 12 వేయటానికి అని ప్రశ్నించారు .. పోలీసులకు ,కాంగ్రెస్ వారికీ మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు , జావేద్ తోపాటు మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు , ఇతర కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు …

This image has an empty alt attribute; its file name is vatte-janaiah-pai-kesulu-etti-veyali--1024x768.jpg

మరో సంఘటనలో సూర్యాపేట డీసీఎంస్ చైర్మన్ వత్తె జానయ్య పై మంత్రి జగదీష్ రెడ్డి 76 కేసులు పెట్టించారని ఇది అన్యాయమని బహుజనులకు రాజ్యాధికారం కావాలని అడిగినందుకు ఆయన్ను ఇబ్బందులకు గురి చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం బైపాస్ రోడ్డులో రస్తా రోకో నిర్వహించారు .దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది…పోలిసుల జోక్యం తో ఆందోళనకారులు ఆందోళన విరమించారు …

Related posts

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఇంతకు లోకల్ నా …? నాన్ లోకలా …?

Ram Narayana

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంది …మంత్రి పొంగులేటి

Ram Narayana

మంత్రి పొంగులేటి దిద్దుబాటు చర్యలు …మీ ముగింటకు మీ ఎమ్మెల్యే పేరుతో పర్యటనలకు శ్రీకారం …

Ram Narayana

Leave a Comment