క్రైమ్ వార్తలు

షాకింగ్: 5 ఏళ్ల బాలికపై 7 ఏళ్ల బాలుడి అత్యాచారం!

  • ఉత్తర్‌ప్రదేశ్ కాన్‌పూర్ దేహాత్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • తన కూతురిని అత్యాచారం చేశాడంటూ పొరుగింటి బాలుడిపై మహిళ ఆరోపణ
  • పిల్లలిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు వెల్లడి
  • ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్‌‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఐదేళ్ల కూతురిని పొరుగున ఉండే ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఆరోపించింది. కాన్‌పూర్‌ దేహాత్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దారుణం జరిగింది. ఘటనపై బాలిక తల్లి అక్బర్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. పిల్లలిద్దరికీ జిల్లా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. 

ఈ నేపథ్యంలో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఐపీసీ‌లోని సెక్షన్ 82 ప్రకారం ఏడేళ్లలోపు చిన్నారులు చేసే ఏ చర్యను నేరంగా పరిగణించరాదు. దీంతో, ఈ కేసు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో న్యాయనిపుణుల సలహా ఆధారంగా ముందుకెళతామని పేర్కొన్నారు. 

Related posts

బీజేపీ ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్న గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి!

Drukpadam

సైబర్ నేరగాళ్లకు చిక్కిన 15 వేలమంది భారతీయులు …700 కోట్లు హాంఫట్ ..!

Ram Narayana

ఐదేళ్ల చిన్నారిపై దారుణం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు!

Ram Narayana