క్రీడా వార్తలు

వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న టీమిండియా

  • ఇవాళ టీమిండియా, ఆసీస్ మధ్య వన్డే మ్యాచ్
  • 5 వికెట్లతో నెగ్గిన భారత్
  • ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకిన వైనం
  • రెండో స్థానంలో పాకిస్థాన్, మూడో స్థానంలో ఆసీస్

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఆల్ రౌండ్ షోతో విజయం సాధించిన టీమిండియా… ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇవాళ మొహాలీలో జరిగిన వన్డేలో భారత్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లో పైచేయి నిరూపించుకున్న టీమిండియా 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ విజయంతో పాటు టీమిండియాకు వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం లభించింది.

వన్డేల్లో ప్రస్తుతం టీమిండియా రేటింగ్ 116 కాగా, 115 రేటింగ్ తో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (111) మూడో స్థానంలో ఉంది.

ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్ టాప్-10 జాబితా…

1. టీమిండియా- 116
2. పాకిస్థాన్- 115
3. ఆస్ట్రేలియా- 111
4. దక్షిణాఫ్రికా- 106
5. ఇంగ్లండ్- 105
6. న్యూజిలాండ్- 100
7. బంగ్లాదేశ్- 94
8.  శ్రీలంక- 92
9. ఆఫ్ఘనిస్థాన్- 80
10. వెస్టిండీస్- 68

Related posts

మయాంక్ అగర్వాల్ కే పట్టం.. కెప్టెన్ గా ప్రకటించిన పంజాబ్ కింగ్స్

Drukpadam

మూడో టెస్టులో చిత్తుగా ఓడిన భారత్…

Drukpadam

ఆసియా కప్ క్రికెట్ లో పాక్ పై భారత్ ఆటతీరు అద్భుతం అంటూ ప్రధాని మోడీ ప్రశంశ !

Drukpadam