Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

బండ్లగూడ జాగీలో వినాయకుడి లడ్డు ధర కోటి 26 లక్షలు…!

హైదరాబాద్ లో వేలంపాటలో రూ. 1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ.. ఎక్కడంటే..?
బండ్లగూడ జాగీలో కళ్లు చెదిరే ధరకు లడ్డూ వేలం
కీర్తి రిచ్మండ్ విల్లాలో వేలంపాట నిర్వహణ
గత ఏడాది రూ. 60.80 లక్షలు పలికిన లడ్డూ

హైదరాబాద్ నగరం మొత్తం జై గణేష్ నామస్మరణతో మారుమోగుతోంది. గణేశ్ ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు వేలాది వినాయకులు నిమజ్జనాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూ వేలంపాటలు కూడా పోటీపోటీగా సాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూ కళ్లు చెదిరే ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ఏకంగా రూ. 1.26 కోట్లు పలికింది. ఎన్నడూ లేని విధంగా ఇంత ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది కూడా ఇక్కడి గణపతి లడ్డూ రికార్డు స్థాయిలోనే ధర పలికింది. పోయిన సంవత్సరం రూ. 60.80 లక్షలు పలకగా… ఈ ఏడాది రెండింతలు ఎక్కువ ధర పలికింది. ప్రతిసారి బాలాపూర్ లడ్డు ధర అధికంగా పలకడం మనకు తెలిసిందే. దేశంలోనే బాలాపూర్ లడ్డు వేలంపాట అంటే బడాబాబులు అందరు అక్కడకు చేరుకొని వేలంపాటలో పాల్గొనడం అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ,ఎంపీలు , రావడం ఆనవాయితీగా మారుతుంది. కానీ నేడు బాలాపూర్ లడ్డు ధర ఎంతపలుకుతుందేమో కానీ బండ్లగూడ జాగీలో కళ్లు చెదిరే ధరకు లడ్డూ వేలం అక్షరాలా కోటి 26 లక్షలకు ఒక భక్తుడు సొంతంచేసుకోవడం టాక్ ఆఫ్ ద వినాయక నిమజ్జనాల ఉత్సహాలుగా మారింది.. నల్లగొండ పాతబస్తీలో కూడా లడ్డు ధర 36 లక్షల పలకడం విశేషంగా చెప్పుకుంటున్నారు . ఈ వేలంపాటలో రాజకీయనాయకులు పాల్గొనడం విశేషం …భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి లుకూడా పాల్గొన్నారు . వేలంపాటలో లడ్డు దక్కించుకోవడం ఒక వరంగా భావిస్తారు .అందువల్లనే లడ్డుపాటకు ప్రతి సంవత్సరం డీమాండ్ పెరుగుతుంది..గతంలో ఒక్క బాలాపూర్ మాత్రమే ప్రసిద్ధికెక్కింది…

బాలాపూర్ లడ్డూకు వేలంలో రూ.27 లక్షలు

దేశవ్యాప్తంగా పేరొందిన బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది తుర్కయాంజల్ కు చెందిన దాసరి దయానంద రెడ్డి సొంతం చేసుకున్నారు. గురువారం ఉదయం జరిగిన వేలంపాటలో మొత్తం 36 మంది పోటీపడగా.. రూ.27 లక్షలకు దయానందరెడ్డి దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఉదయం రూ.1,116 తో బాలాపూర్ ఉత్సవ సమితి వేలంపాటను ప్రారంభించింది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీ పడడంతో ధర అమాంతం పెరుగుతూ పోయింది. చివరకు రూ.27 లక్షలు పాడిన దయానందరెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. కాగా, లడ్డూ వేలం పూర్తవడంతో ఉత్సవ కమిటీ గణేషుడి శోభాయాత్రను ప్రారంభించింది. చాంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్ నుమా, చార్మినార్ మీదుగా బాలాపూర్ గణపతి హుస్సేన్ సాగర్ చేరుకుంటారు.

రూ.450 తో మొదలైన వేలం..
బాలాపూర్ గణపతి లడ్డూ వేలం దేశవ్యాప్తంగా పేరొందింది. 1994 నుంచి లడ్డూ వేలం ప్రారంభించారు. తొలి ఏడాది రూ.450 లకు కొలన్ మోహన్ రెడ్డి అనే రైతు గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 28 సార్లు లడ్డూ వేలం నిర్వహించారు. కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలం నిర్వహించలేదు. ఆ ఏడాది లడ్డూను ఉత్సవ కమిటీ సీఎం కేసీఆర్ కు అందజేసింది. గణేషుడి లడ్డూను వేలం వేయగా వచ్చిన సొమ్ముతో బాలాపూర్ ఉత్సవ కమిటీ స్థానికంగా పలు అభివృద్ధి పనులు చేస్తోంది.

ఖైరతాబాద్ మహా గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు… క్రేన్ నెం.4 వద్ద నిమజ్జనం పూర్తి
హైదరాబాదులో గణేశుడి శోభాయాత్ర
ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ గణపతి
క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు
మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి

హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ విఘ్ననాథుడి శోభా యాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు నిర్వహించారు.

ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీ దశ మహా విద్యా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఎప్పుడూ చివరగా తరలివెళ్లే ఖైరతాబాద్ మహా వినాయకుడ్ని ఈసారి ముందుగానే నిమజ్జనం చేశారు. ప్రస్తుతం గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది.

Related posts

లీగల్ నోటీసులు ఇస్తా.. సోషల్ మీడియా ప్రచారంపై జగ్గారెడ్డి సీరియస్

Ram Narayana

బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..బీజేపీ కార్యాలయంలో దిగబెట్టిన వైనం!

Ram Narayana

నేను పోటీ చేయను.. పార్టీ కోసం పనిచేస్తాం: గుత్తా సుఖేందర్ రెడ్డి…

Drukpadam

Leave a Comment