ఆంధ్రప్రదేశ్

హైదరాబాదులో నారా భువనేశ్వరి రాజమండ్రిలో బ్రహ్మణి ఢిల్లీ లో లోకేష్ డ్రమ్మలు మోగించిన కార్యక్రమంలో

  • చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు
  • మోత మోగిద్దాం కార్యాచరణ విజయవంతం చేసిన నేతలు, కార్యకర్తలు
  • హైదరాబాదులో తన నివాసంలో మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి
  • సత్యమేవ జయతే అంటూ నినదించిన చంద్రబాబు అర్ధాంగి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిర్వహించిన మోత మోగిద్దాం కార్యక్రమంలో నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. హైదరాబాదులోని తమ నివాసంలో ఆమె తీన్ మార్ డ్రమ్స్ మోగించారు. రాజమండ్రిలో బ్రహ్మణి, ఢిల్లీలో లోకేష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, రోజు తాము చేస్తున్న ఈ శబ్దం ప్రజలందరికీ చేరుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు నీతి నిజాయతీ కలిగిన నేత అని స్పష్టం చేశారు.. ఈ పోరాటంతో చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అంటూ నినదించారు. బాబుతో నేను ప్లకార్డును ప్రదర్శించారు.

Related posts

త్వరలో పాపికొండల యాత్ర.. ప్రారంభానికి పర్యాటక శాఖ అనుమతి!

Drukpadam

ఈ కాలంలో తాగేందుకు ఎన్నో వెరై‘టీ’లు!

Drukpadam

సూప‌ర్‌ స్టార్ కృష్ణ రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోనే.. జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

Ram Narayana