- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- హైదరాబాదులోనూ టీడీపీ శ్రేణుల నిరాహార దీక్షలు
- సనత్ నగర్ డివిజన్ జెక్ కాలనీలో బాబుతో నేను దీక్ష
- దీక్షా శిబిరం వద్దకు విచ్చేసిన మంత్రి తలసాని
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాదులోని సనత్ నగర్ లో టీడీపీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. సనత్ నగర్ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత నియోజకవర్గం. ఈ నేపథ్యంలో, తలసాని నేడు సనత్ నగర్ డివిజన్ లోని లోని జెక్ కాలనీలో నిర్వహిస్తున్న టీడీపీ దీక్షా శిబిరానికి విచ్చేశారు. ‘బాబుతో నేను’ పేరిట చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న టీడీపీ మద్దతుదారులను పలకరించారు. దీక్ష కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తలసాని రాకతో టీడీపీ దీక్షా శిబిరం వద్ద కోలాహలం నెలకొంది. కొంతసేపు అక్కడే ఉన్న ఆయన అనంతరం తిరిగి వెళ్లారు.