తెలంగాణ వార్తలు

జెమిని టీవీ సీరియల్ తారల చే ఖమ్మం లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

జెమిని టీవీ సీరియల్ తారల చే ఖమ్మం లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
ఆడిపాడిన మహిళలు …చూడముచ్చటగా ఆటపాటలు
రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించిన మహిళలు
ఉల్లాసంగా ,ఉత్సవహంగా జెమిని బతుకమ్మ కార్యక్రమాలు
రాష్ట్రమంతా బతుకమ్మ ఉత్సవాలు జరుపుతున్నట్లు నిర్వాహకుల వెల్లడి

ఖమ్మం లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ వ్యాపితంగా ప్రజలు ప్రధానంగా మహిళలు అత్యంత వైబోవోపేతంగా జరుపుకునే పండుగ …9 రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రకాలుగా కొలుచుకోవడం ఈపండగ ప్రత్యేకత …జమిని టీవీ సీరియల్ లో నటించే తారలు నూతనంగా మహిళలకు అంత్యంత ఇష్టమైన బతుకమ్మ కనుక రాష్ట్రంలో వారిని సమీకరించి వారితో కలిసి ఆదిపడాలనే ఆలోచనతో చేసిన చిన్న ప్రయత్నానికి మంచి స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు ..మంగళవారం వారు ఖమ్మంలో వచ్చి సంబరాలు జరపడం ఖమ్మం ప్రజలకు ఆనందాన్ని నింపింది …అక్టోబర్ 17 సోమవారం ఖమ్మం శ్రీ రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రం శ్రీ శృంగేరి శంకర మఠం ట్రంక్ రోడ్లో జరిగే బతుకమ్మ సంబరాలలో ఒంటరి గులాబి సీరియల్ తారలు అలాగే త్వరలో ప్రసారం కాబోతున్న సరికొత్త సీరియల్ కొత్తగా రెక్కలొచ్చెనే తారలు పాల్గొని ఖమ్మం లో బతుకమ్మ సంబరాల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు .

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక నిలిచే బతుకమ్మ పండుగలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యంగా నిలిచే అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి .. గౌరీ దేవిగా భావిస్తూ పాటలు, నృత్యాలతో ఈ దసరా శరన్నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అక్టోబర్ 14 నుండి ప్రారంభమైన ఈ బతుకమ్మ సంబరాలు 9 రోజులపాటు తెలంగాణ రాష్ట్రమంతా జరుగుతాయి. ఈ సందర్భంగా జెమిని టివి సీరియల్స్ తారలంతా ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో పలు ప్రాంతాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం విశేషం….

ఈ సంబరాలలో తారల ఆట పాటలతో పాటు, ఆటలలో గెలిచిన వారికి చీరలను బహుమతిగా అందజేశారు . ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు …


Related posts

జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి..

Ram Narayana

కేంద్రం గుడ్‌న్యూస్… మెహిదీపట్నం స్కైవాక్ కోసం స్థలాన్ని అప్పగించనున్న రక్షణ శాఖ

Ram Narayana

సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి… మృతులంతా హైదరాబాదీలేనని హజ్ కమిటీ ప్రకటన

Ram Narayana