తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎన్నికల్లో మద్దతు కోరిన కిషన్ రెడ్డి.. చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న పవన్ కల్యాణ్

  • పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశం
  • తెలంగాణ అసెంబ్లీలో మద్దతివ్వాలని అడిగిన బీజేపీ నేతలు
  • జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను జనసేనాని మద్దతు కోరిన బీజేపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం జనసేనానితో కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బీజేపీకి మద్దతు విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వారికి చెప్పారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను బీజేపీ నేతలు పవన్ మద్దతును కోరారు.

జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి దగ్గరైంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని పవన్ భావిస్తుండగా, బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

కేసీఆర్ ఎవరినైనా మోసం చేయగలడు.. రాములు నాయక్ పరిస్థితి చూస్తున్నారుగా: ఈటల రాజేందర్

Ram Narayana

ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు?: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్న

Ram Narayana

నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

Ram Narayana