Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణాలో కాంగ్రెస్ సునామి… బీఆర్ యస్ ,బీజేపీ ఎంఐఎంలు కొట్టకపోవడం ఖాయం ….రాహుల్ గాంధీ!

తెలంగాణాలో కాంగ్రెస్ సునామి… బీఆర్ యస్ ,బీజేపీ ఎంఐఎంలు కొట్టకపోవడం ఖాయం ….రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేసిన కేసీఆర్ కుటుంబం
సీఎం అంటే ప్రజాసేవకుడిగా కాకుండా రాజులాగా కేసీఆర్ వ్యహరిస్తున్నారు
బీజేపీ ,బీఆర్ యస్ , ఎంఐఎం ఒక్కటై కాంగ్రెస్ ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయి
ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని నిర్ణయానికి వచ్చారు ..
కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు ,వేధింపులు … కార్యకర్తలు పులులుగా విజృభించాలి …!

తెలంగాణలో కాంగ్రెస్ సునామి రాబోతుందని దానిముందు బీఆర్ యస్ , బీజేపీ , ఎంఐఎం పార్టీలు కొట్టుకొని పోవడం ఖాయమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు . మూడురోజుల పర్యటనలో భాగంగా రెండవరోజు గురువారం బస్సు యాత్రలో భాగంగా పెద్దపల్లి వచ్చినా రాహుల్ ఒక్కడా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడారు …తెలంగాణ వికాసం కోసం ,ప్రజల బ్రతుకులు బాగుపడాలని , సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రజల సంక్షేమం , రాష్ట్ర అభివృద్ధిని మార్చిన కేసీఆర్ తన కుటుంబం లాభంకోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఉపయోగించుకోవడం దారుణమని ధ్వజమెత్తారు . అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ కుటుంబాల పాలనపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రజల సొమ్మును లూటిచేసిన కేసీఆర్ ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు . గత పది సంవత్సరాలుగా కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై , ప్రజలపై కేసులు , వేధింపులకు గురి చేస్తున్నారని అందువల్ల కేసీఆర్ పాలనను అంతం చేయాలంటే కార్యకర్తలు పులులుగా విజృభించాలని పిలుపునిచ్చారు .. సీఎం అంటే ప్రజాసేవకుడిగా కాకుండా రాజ్యానికి రాజుల వ్యవహరిస్తున్నారని కేసీఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు . రాష్ట్రంలో కులగణన చేయకుండా ,మోడీ బాటలో కేసీఆర్ పయనిస్తున్నారని దుయ్యబట్టారు . కేసీఆర్ మంత్రివర్గంలో కుటుంబంలో ముగ్గురు మంత్రులు ఉంటె …జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని ఇదేనా బీసీలపట్ల కేసీఆర్ ప్రేమ అంటూ నిలదీశారు …

బీఆర్ యస్ ,బీజేపీ , ఎంఐఎం పార్టీలు ఒక్కటే …

బీఆర్ యస్ ,బీజేపీ , ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని వారు కేవలం కాంగ్రెస్ ను ఓడించేందుకు మాత్రమే పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు . ఎంఐఎం అనేక రాష్ట్రాల్లో బీజేపీకి ఉపయోగపడేవిధంగా ప్రతిపక్షాలను దెబ్బతిస్నేదుకు పోటీ పెట్టి ప్రతిపక్షాల ఓట్లను చీల్చి బీజేపీకి ఉపయోగపడుతుందని అన్నారు .వారి నాటకాలను ప్రజలు గుర్తించాలన్నారు . తెలంగాణాలో వారు ఎన్ని ఎత్తులు వేసిన కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా ఆపలేరని అన్నారు . కాంగ్రెస్ కార్యకర్తలు పులులుగా విజృభించాలని పిలుపునిచ్చారు . రాహుల్ గాంధీ ప్రసంగాలను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగు అనువాదం చేశారు …కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత విక్రమార్క మల్లు ,మధు యాష్కీ , పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబు , ప్రచార కమిటీ కో -చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ..

Related posts

కర్నూలు జిల్లాలో పొలం దున్నుతుంటే రైతు కంటపడ్డ వజ్రం

Ram Narayana

12 రోజుల్లో 5.4 సెంటీమీట‌ర్లు కుంగిన జోషిమ‌ఠ్‌.. శాటిలైట్ చిత్రాల విడుదల!

Drukpadam

క్వీన్ ఎలిజబెత్ హత్యకు కుట్ర… సిక్కు యువకుడి అరెస్ట్!

Drukpadam

Leave a Comment