ప్రమాదాలు ...

రోడ్డు ప్రమాదంలో కొండా సురేఖకు గాయాలు.. కంటతడి పెట్టుకున్న కొండా మురళి

  • రాహుల్ బస్సు యాత్రల్లో పాల్గొన్న సురేఖ
  • బైక్ ర్యాలీ సందర్భంగా అదుపుతప్పిన సురేఖ నడుపుతున్న స్కూటీ
  • కంటి పైభాగానికి, చేతికి గాయాలు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ర్యాలీలో సురేఖ స్వయంగా స్కూటీని నడిపారు. ఈ సందర్భంగా స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె కుడి కన్ను పైభాగానికి చేతికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సురేఖ గాయపడిన విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడ్డ భార్యను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు.

Related posts

కర్నూలు జిల్లాలో పెను విషాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం.. 19 మంది మృతి!

Ram Narayana

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు ఏపీ యువకుల మృతి

Ram Narayana

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్ర‌మాదం.. ముగ్గురి మృతి

Ram Narayana