తెలంగాణ రాజకీయ వార్తలు ..

కొడంగల్ నియోజకవర్గంలో నా బల… రేవంత్ రెడ్డి…

  • నా ప్రజలు… నా బలం అని రేవంత్ రెడ్డి ట్వీట్
  • రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియోను షేర్ చేసిన రేవంత్ రెడ్డి
  • ఈ రోజు కొడంగల్‌లో పర్యటించిన టీపీసీసీ చీఫ్

తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తన అభిమానులు, కార్యకర్తల కోలాహలానికి సంబంధించిన వీడియోను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిని తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ రీట్వీట్ చేసింది. మై పీపుల్… మై స్ట్రెంత్… నా ప్రజలు.. నా బలం అని ట్వీట్ చేశారు. తన అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్‌లో ఈ రోజు పర్యటించానని పేర్కొన్నారు. 2.13 సెకండ్ల వీడియోను రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆయనకు జై కొడుతూ నినాదాలు చేశారు.

నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ సాధించి పెట్టాలని కోరారు. ర్యాలీగా బయలుదేరిన ఆయన అభిమానులకు, కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ వీడియోకు గంటలోనే 1600కు పైగా లైక్స్, 363కు పైగా షేర్లు అయ్యాయి. దాదాపు 15వేల మంది చూశారు.

Related posts

తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు: బీజేపీ అధినేత జేపీ నడ్డా

Ram Narayana

బీజేపీలో నేతలకేమైంది …కీలకసమావేశానికి కొందరు నేతలు డుమ్మా!

Ram Narayana

అజారుద్దీన్ మంత్రి పదవికి బీజేపీ బ్రేకులు.. ఈసీకి ఫిర్యాదు1

Ram Narayana