Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలపై తుమ్మల భగ్గు భగ్గు …తన ఓటమిలో కేటీఆర్ పాత్ర అంటూ బిగ్ బాంబు ..!

బిగ్ బాంబ్ … నాడు తన ఓటమిలో కేటీఆర్ పాత్ర …తుమ్మల
పాలేరు ఏమి జరిగిందనేది కేసీఆర్ కు అంతా తెలుసు
తన ఓటమిపై వివరణ కోసం కేసీఆర్ ను కలిశా …ఆయన అచేతనంగా ఉన్నారు
సీఎం కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం ..
తాను పాలేరు ఉపఎన్నికల్లో కోరి పోటీచేసినట్లు చెప్పడంలో వాస్తవం లేదు
ఎవరు లేకపోతేనే నేను పోటీచేస్తానని ముందుకు వచ్చా …
ఉమ్మడి జిల్లాలో నేను చేరిన తర్వాతనే గులాబీ జెండా రెపరెపలాడినది ..
తనను చేరమని కేసీఆర్ సీఎం గా బ్రతిమిలాడారు …3 గంటలకు పైగా భేటీ జరిగింది
తాను భక్తరామదాసు ,సీతారామ ప్రాజక్టులను అడిగాను ..ఎలాంటి షరతులు పెట్టలేదు ..
పార్టీ మారినందుకు పువ్వాడ అజయ్ కి గవర్నమెంట్ భూములు …ఉపేందర్ రెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టింది నిజం కదా…?

కేసీఆర్ ఖమ్మం పర్యటనలో తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు దీటుగా స్పందించారు . 2018 ఎన్నికల్లో పాలేరు లో తన ఓటమిలో కేటీఆర్ పాత్ర ఉందని బిగ్ బాంబ్ పేల్చారు …దీనిపై మొదట స్పందించిన తుమ్మల తన వ్యాపార భాగస్వామిగా ఉన్న పువ్వాడ అజయ్ కోసం తన ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి తనను ఓడించారని తుమ్మల ఆరోపణలు గుప్పించారు …విషయం ఇది కాగా జీళ్ళచెర్వు సభలో తనపై అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు ..

ఓడిపోయి ఇంటి దగ్గర వున్నోడిని తీసుకు వచ్చి మంత్రి పదవి ఇస్తే ఖమ్మం జిల్లాలో అయన పార్టీ కోసం చేసింది సున్నా కేసీఆర్ తుమ్మల పై కేసీఆర్ నేరుగానే విమర్శలు గుప్పించారు .. పాలేరులో ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే వచ్చిన ఉప ఎన్నికల్లో అయన సతీమణికి టికెట్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు అడ్డుపడి నేనే పోటీ చేస్తానని నన్ను బ్రతిమాలితే టికెట్ ఇచ్చి దగ్గర వుండి 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించామని పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేసీఆర్ మాటలను ఖండించారు ..
వాస్తవానికి ఆరోజు పాలేరులో పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను పోటీ చేశానన్న సంగతి మర్చిపోయి కేసీఆర్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు …

నా పై విమర్శలు చేసిన కేసీఅర్ 2014 లో రాష్ట్రంలో బీఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది కేవలం కొత్తగూడెం సీటు మాత్రమే కదా….అది మరిచిపోయారా ..?అని ప్రశ్నించారు ….ఆసమయంలో సీఎంగా ఉన్న మీరు స్వయంగా నా దగ్గరకు వచ్చి మూడు గంటలసేపు బ్రతిమాలి నన్ను పార్టీలోకి ఆహ్వానించింది మర్చి పోరాయరా కేసీఆర్ గారు అన్న తుమ్మల …

నేనేమైనా పైరవీల కోసం,పదవుల కోసం మీ పార్టీలో చేరానా ? ఆరోజు పార్టీలో చేరేముందు కూడా పదవుల గురించి నేను మాట్లాడలేదు కేవలం భక్తరామదాసు,సీతారామ ప్రాజెక్టుల గురించి పార్టీలో జాయిన్ అవుతున్నానని నేను మీకు చెప్పింది నిజం కాదా ?
దానికి మీరు ఒప్పుకున్నది నిజం కాదా ? కానీ ఈరోజు నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు .

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను బీఆర్ యస్ పార్టీలోకి రాకముందు మీ పార్టీకి జెండా పట్టే కార్యకర్త లేడని తుమ్మల నాగేశ్వరరావు … కేవలం నేను పార్టీలో జాయిన్ అయిన తరువాత 280 మంది సర్పంచులు, యంపిటీసీలు, జడ్పీటీీసీలు,సొసైటి అధ్యక్షులు,డీసీసీబీ చైర్మన్,జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సితో సహా వేల మంది కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి మీ సమక్షంలోనే పార్టీలో చేరిన సంగతి మర్చిపోయి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు .

అసలు 2018 ఎన్నికల్లో పాలేరులోలో నా ఓటమికి ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసు…..నీకొడుకు స్నేహితుడు పువ్వాడ అజయ్ ని మంత్రిని చేయడం కోసం,దనదాహంతో ఆయనతో కలిసి వ్యాపారాలు మొదలు పెట్టింది నిజం కదా …? హైదరాబాద్ బాచుపల్లిలో మమత మెడికల్ కాలేజీ పెట్టుకోవడం కోసం స్వయంగా నీ కొడుకే నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి ఓడించింది నిజం కాదా ? ఈ విషయం మీకు తెలిసీ కూడా ఏమి చేయలేని అచేతన స్థితిలో ఉంది నిజం కాదా ? అని కేసీఆర్ పై తుమ్మల ప్రశ్నల వర్థం కురిపించారు …

అంతే కాకుండా ఎన్నికలకు నెలరోజుల ముందు టికెట్లు కేటాయించి నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించింది నీ కొడుకు కాదా ?కేసీఆర్ గారు దీనికి మీ సమాధానం ఏమిటి అని ప్రశ్నించారు …పార్టీలో జరుగుతున్న అణ్యధోరణులను ఎప్పటికప్పుడు మీకు చెప్పినప్పటికీ మీరు పెడచెవిన పెట్టీ పార్టీ బ్రష్టుపట్టీ పోవడానికి కారణం మీరు కాదా ?
ఇంత జరిగినా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఎవరిని సంప్రదించకుండా ఆప్పటికపుడు నామా నాగేశ్వరరావు కు యంపి టికెట్ కేటాయిస్తే పార్టీకి కట్టుబడి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించింది నిజం కాదా ? ఆతరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో,రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం నేను చేసిన కృషి ఏమిటో మీకు తెలియదా ?
పార్టీలో ఎన్ని అవమానాలు జరిగిన పార్టీ విధానాలకు కట్టుబడి ఏరోజు పల్లెత్తు మాట అనలేదు ఇది నా సంస్కారం…..

ఎన్నో అవకాశవాద మాటలు మాట్లాడిన మీరు స్వయంగా భక్తరామదాసు ప్రాజెక్ట్ ప్రారంభానికి వచ్చినపుడు సభలో “అపర భగీరథున్ని నేను కాదు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు అపర భగీరథుడు అని నా గురించి మీరు ఆన్న మాటలు ఇంకా పాలేరు ప్రజలు ఇంకా మర్చిపోలేదు,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ,డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వుంది అని మీరు నాకు ఇచ్చిన కితాబు ఇంకా పాలేరు ప్రజల గుండెల్లో నిక్షిప్తమై వుంది అనే విషయం మర్చిపోయి మీరు నాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు తుమ్మల …

“40 సంవత్సరాల మన ఇద్దరి స్నేహం నేనేంటో,నా నిబద్దత ఏమిటో తెలిసి కూడా నా పార్టీ మార్పు గురించి ఇలాంటి నీతిమాలిన మాట్లాడటం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా” “కానీ….
అసలు పదవుల కోసం,అవసరాల కోసం పార్టీలు మారిన పువ్వాడ అజయ్ కుమార్ కు గవర్నమెంట్ భూములు కట్టబెట్టి,కందాల ఉపేందర్ రెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టి వాళ్ళను పక్కన పెట్టుకుని పార్టీల మార్పు గురించి మాట్లాడటం హాస్యస్పధంగా ఉందన్నారు” …

ఎవరి నిబద్దత ఏమిటో ఖమ్మం జిల్లా ప్రజలకు బాగా తెలుసు.. కొత్తగా మీ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు …ఇలాంటి నీతిమాలిన మాలిన మాటలు మాట్లాడటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు తుమ్మల …. కేసీఆర్ మాటలు ..తుమ్మల స్టేట్ మెంట్ చర్చనీయాంశంగా మారింది …

Related posts

బీజేపీలో తనకు అన్యాయం జరిగింది …పార్టీని వీడతా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి…!

Ram Narayana

బీఆర్ యస్ మంత్రి గంగుల కమలాకర్ కొత్త లాజిక్ …

Ram Narayana

ఉస్మానియా విద్యార్థుల ఆందోళనతో కేసీఆర్ దీక్ష రూటు మార్చారు: సీపీఐ నారాయణ

Ram Narayana

Leave a Comment