- ఖమ్మంలో తనపై జరిగిన దాడి వెనుక పెద్ద కుట్ర ఉందన్న అంబటి
- తనను భౌతికంగా తొలగించాలని చూస్తున్నారనే విషయాన్ని గతంలోనే చెప్పానని వ్యాఖ్య
- పవన్ కల్యాణ్ అంటే కిరాయి కోటిగాడు అంటూ ఎద్దేవా
ఖమ్మంలో తనపై జరిగిన దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీ కానీ, వ్యక్తి కానీ బతికి బట్ట కట్టలేదని చెప్పారు. తనపై జరిగిన దాడిని చిన్నదిగా చూడొద్దని అన్నారు. తనను భౌతికంగా తొలగించాలని చూస్తున్నారనే విషయాన్ని ఇంతకు ముందే చెప్పానని తెలిపారు. తనపై దాడి చేసిన వారిలో తొమ్మిది మందిని గుర్తించారని… వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారని… వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారని చెప్పారు.
కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారని… వారు టీడీపీని సర్వ నాశనం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ అంత బలంగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కదా అని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే పీకే కాదని… ఆయన కేకే అంటే కిరాయి కోటిగాడు అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ప్రగల్భాలు పలుకుతుంటారని… చంద్రబాబును ఏమైనా అంటే రోడ్డుపై పడుకుంటారని విమర్శించారు.