ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ ను దించడం అంటే దత్తపుత్రుడు ఏమనుకుంటున్నాడో!: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా

  • పక్క వ్యక్తిని సీఎం చేయడానికి దత్తపుత్రుడు పార్టీ పెట్టాడన్న అనిల్
  • ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి దత్తపుత్రుడు ఒక్కడేనని వెల్లడి
  • జగన్ ను దించడం నీ అబ్బ తరం కాదు అంటూ ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని, రాజకీయంగా పైకి రావాలని పార్టీ పెడతారని, కానీ దత్తపుత్రుడు మాత్రం పక్క వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడని, బహుశా ఇలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో దత్తపుత్రుడు ఒక్కడేనని విమర్శించారు. 

“దత్తపుత్రుడు ప్రతిసారి ఒక మాట చెబుతుంటాడు… నా ఏకైక లక్ష్యం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడమే అంటాడు. జగన్ మోహన్ రెడ్డిని దించడం అంటే ఏమనుకుంటున్నాడో అర్థం కావడంలేదు. జగన్ మోహన్ రెడ్డిని దించడం నీ వల్ల కాదు కదా… నీ అబ్బ తరం కూడా కాదు. నువ్వు పొత్తు పెట్టుకుని కట్టకట్టుకుని వచ్చినా ఏమీ చేయలేవు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు జగన్ మోహన్ రెడ్డిని కాపు కాసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయనను దించడం ఎవరి వల్లా కాదు” అని స్పష్టం చేశారు. 

2024 ఎన్నికలతో ఒక పార్టీ మూత పడుతుందని, మరో పార్టీ ఇంకో పార్టీలో కలిసిపోతుందని అనిల్ కుమార్ జోస్యం చెప్పారు.

Related posts

టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు పెట్టిన కొత్త సంవత్సర వేడుకలు…

Ram Narayana

ఏపీ ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీలు ఇవే..!

Ram Narayana

సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తా: జగన్

Ram Narayana