Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఐటీ ,ఈడీ దాడులు చేసి జైల్లో పెట్టినా, కాంగ్రెస్ గెలుపును ఆపలేరు …పొంగులేటి

ఐటీ ,ఈడీ దాడులు చేసి జైల్లో పెట్టినా, కాంగ్రెస్ గెలుపును ఆపలేరు …పొంగులేటి
కాంగ్రెస్ ను బలహీన పర్చాలని బీఆర్ యస్ బీజేపీ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు
కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ నేర్చుకున్న విద్య
ప్రజలు కేసీఆర్ మోసాలను , కుట్రలు , కుతంత్రాలను తెలుసుకున్నారు .
.

ఐటీ ,ఈడీ దాడులతో నన్న దెబ్బతీయాలని చేస్తే జరిగేపనికాదు …అన్నిటికి తెగించే వచ్చాను … ఎన్ని కుట్రలు పన్నినా కుతంత్రాలు చేసిన వెనక్కు తగ్గేదిలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు . ఆయన ఇంటిపై ఐటీ దాడుల కొనసాగుతున్న నేపథ్యంలో దాడులు జరుగుతుండగానే నామినేషన్ వేసేందుకు ఐటీ అధికారులు అనుమతిచ్చారు .ఈ సందర్భంగా తన ఇంటిముందు ఉన్న మీడియా తో ఆయన మాట్లాడుతూ ,బీఆర్ యస్ బీజేపీ కుట్రలో భాగంగానే ఈదాడులని ఆరోపించారు . తెల్లవారుతుండగానే 15 మంది ఐటీ అధికారులు ,10 సీఆర్పీఎఫ్ సిబ్బంది 5 05 గంటలు వచ్చారు …నేను ముందుగానే లేచి నాకోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకోసం బ్రెష్ చేస్తున్నాను …వచ్చిన వాళ్ళు యూ ఆర్ కమింగ్ ప్రం ఐటీ అన్నారు . మంచిది అన్నారు . వాళ్ళు అడిగినవాటిని ఇచ్చాం … వాళ్ళ హడావుడిని భట్టి మొత్తం 30 కి పైగా కేంద్రాల్లో దాడులు జరుగుతున్నట్లు అర్ధం అయిందన్నారు .

బీఆర్ యస్ బీజేపీ లు కలిసి ఎన్నికేసులైన పెట్టుకోండి భయపడేది లేదు …చివరకు జైల్లో పెట్టిన వెనకడుగు వేసే ప్రసక్తి లేదని పొంగులేటి కుండబద్దలు కొట్టారు . నన్ను ఇంట్లో నుంచి కూడా బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారు .నేను ఐటీ అధికారులకు చెప్పాను…ఎన్నికల్లో పోటీచేస్తున్నందున నామినేషన్ వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాను . నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది వస్తారు .నన్ను వెళ్లకుండా నిర్బంధిస్తే తరవాత జరిగే పరిణామాలకు నేను భాద్యుణ్ని కాదని దీంతో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చారు అయితే వేసిన తర్వాత తిరిగి రావాలని అన్నారు . నేను ముందుగానే అభ్యర్థిగా ప్రచారం చేసేందుకు షడ్యూల్ నిర్ణయించుకున్నాను . నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం అని అన్నారు .

కుట్రలు ,కుతంత్రాలు కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య

కుట్రలు ,కుతంత్రాలు కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య , బీజేపీ తో కుమ్మక్కై కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు .అందులో భాగంగానే కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేయిస్తున్నారని అన్నారు . నాకు ఐటీ దాడుల గురించి ముందే తెలుసు …అయితే ఇది ఇన్ సైడ్ సమాచారం కాదు …నేను ఊహించాను నిన్న మీడియా తో కూడా చెప్పాను …అదే జరిగిందని అన్నారు . మీడియాతో మాట్లాడిన అనంతరం పొంగులేటి అక్కడ నుంచి వేలాది మంది వెంట రాగా ప్రదర్శనగా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు …

Related posts

బీజేపీలో చేరిన నా కొడుకు గెలవకూడదు.. కాంగ్రెస్ సీనియర్ ఏకే ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

ఉగాది తర్వాత జనంలోకి గులాబీ బాస్ ….

Ram Narayana

అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది లేదు!: రాజాసింగ్

Ram Narayana

Leave a Comment