కాంగ్రెస్ అభ్యర్థుల నాల్గొవ జాబితా …సూర్యాపేట లో పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ నిరాశ
సూర్యాపేట అభ్యర్థిగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి
తుంగతుర్తి పై అద్దంకి ఆశలు ఆడి ఆశలు లే …
పటాన్ చెరువు అభ్యర్థి మార్పు ….నీలం మధు ముదిరాజ్ స్థానంలో కట్ట శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ ఎట్టకేలకు మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ నాల్గొవ లిస్ట్ ప్రకటించింది …నామినేషన్లు వేసేందుకు ఇక రోజు మాత్రమే గడువు ఉండటంతో అధిష్టానం పేరు ప్రకటించాక తప్పలేదు …ఇప్పటికే చాలామంది ఆలకబూని ఉన్నారు . ప్రధానంగా సూర్యాపేట నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి తిరిగి నిరాశ ఎదురైంది .. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన రామిరెడ్డి దామోదర్ రెడ్డికే మళ్ళీ టికెట్ ఇచ్చారు ..ఇక పటాన్ చెరువు నుంచి నీలం మధు అనే ముదిరాజ్ ను ప్రకటించగా అక్కడ ఎప్పటి నుంచే ఉన్న కట్ట శ్రీనివాస్ గౌడ్ పై పార్టీ నమ్మకం ఉంచింది….ఇక తుంగతుర్తిపై గంపెడు ఆశలు పెట్టుకున్న అద్దంకి దయాకర్ ఆశలు ఆది ఆశలు అయ్యాయి…
కేసి వేణుగోపాల్ పేరుతో వెలువడిన జాభితా ఈవిధంగా ఉంది ..
