కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసిన 39 మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు..
ఎన్నికలు , పార్టీ అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేతో కేసీఆర్ మంతనాలు
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పరిశీలన చేసిన తర్వాతనే దానిపై వ్యాఖ్యానించాలని నిర్ణయం..
అందుకు తగిన సమయం ఇవ్వాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచన


ఈనెల 30 జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ యస్ ఓటమి అనంతరం మొదటిసారిగా
బీఆర్ యస్ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో గల వ్యవసాయక్షేత్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు …
అంతకు ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వరంలో తెలంగాణ భవనంలో సమావేశమైన ఎమ్మెల్యేలు నేరుగా అక్కడ నుంచి ఎర్రవల్లోలి కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు …పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన మొత్తం 39 ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకొని పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు … అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న పార్టీ ఓడిపోవడంపై బీఆర్ యస్ నేతలు ఆలోచనలో పడ్డారు …ఇదే విషయాన్నీ అధినేత దగ్గర ప్రస్తావించారు … ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినప్పటికీ ఓడిపోవడానికి గల కారణాలపై లోతుగా త్వరలో చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు …పార్టీ శాసనసభ పక్ష నేత ఎంపిక కూడా త్వరలో జరిగే సమావేశంలో నిర్ణయించుకుందామని కేసీఆర్ ఎమ్మెల్యేలతో అన్నారు ..ముందు ముందు పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించుకుందామని కేసీఆర్ అన్నారు …కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పరిశీలన చేసిన తర్వాతనే దానిపై మనం వ్యాఖ్యానిద్దామని అంతవరకే వారికీ సమయం ఇద్దామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు ..సమావేశంలో సీనియర్ నేతలు కేసీఆర్ ,హరీష్ రావు , స్పీకర్ పోచారం ,మాజీమంత్రులు తలసాని , కడియం,మల్లారెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ తాతా మధు , మహమూద్ అలీ ,కల్వకుంట్ల కవిత ,కడియం శ్రీహరి , జగదీష్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి , సత్యవతి రాథోడ్ ,రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తో గెలుపొందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ తదితరులు పాల్గొన్నారు …

పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కూడా ఉన్నారు …తనను నమ్మి కేసీఆర్ టికెట్ ఇచ్చారని అందువల్ల తాను పార్టీ మారుతున్నాననే వస్తున్నా వార్తల్లో ఎంతమాత్రం నిజంలేదని కొట్టి పారేశారు …కాంగ్రెస్ హవా కొనసాగిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి గెలుపొందిన వెంకట్రావును అక్కడ ఇంచార్జి గా పనిచేసిన ఎమ్మెల్సీ తాతా మధును కేసీఆర్ , కేటీఆర్ లు ప్రత్యేకంగా అభినందించారు …