Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

 పీఎం కిసాన్ మొత్తం పెంపు అంశంపై కేంద్రం స్పందన

  • రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తున్న కేంద్రం
  • రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ
  • పీఎం కిసాన్ సాయం పెంచుతారంటూ కొంతకాలంగా ప్రచారం
  • లోక్ సభలో లిఖితపూర్వక వివరణ ఇచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి 

దేశంలోని రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ సాయం విడుదల చేస్తున్నారు. అయితే, మొత్తాన్ని పెంచుతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం స్పందించింది. 

ఈ మొత్తాన్ని పెంచే ఆలోచన లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్ సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. పీఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న సాయం పెంపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని తోమర్ స్పష్టం చేశారు. 

దేశంలో 2018 నుంచి పీఎం కిసాన్ సాయం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.

Related posts

మణిపూర్ హింస సిగ్గుచేటని అంగీకరిస్తున్నాం.. ప్రతిపక్షాలు ఈ అంశంపై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి!: అమిత్ షా

Ram Narayana

జయా బచ్చన్ పై రాజ్యసభ చైర్మన్ ఫైర్.. ఎందుకంటే…!

Ram Narayana

కేంద్రంలో నిర్మలమ్మ పద్దు ..అభివృద్ధికి బాటలు ..మోడీ విజన్ కు తార్కాణం అన్న ఆర్ధికమంత్రి

Ram Narayana

Leave a Comment