Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కేసీఆర్ ఆ అంశంపై ఆరా తీశారు: యశోదలో పరామర్శించిన అనంతరం చిరంజీవి

  • కేసీఆర్ సినిమా పరిశ్రమ గురించి అడిగారన్న చిరంజీవి
  • కేసీఆర్ ఆరోగ్యంగా.. హుషారుగా ఉన్నట్లు చెప్పిన మెగాస్టార్
  • సర్జరీ జరిగిన 24 గంటల్లోనే నడిచారన్న చిరంజీవి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సినిమా పరిశ్రమ గురించి తనను అడిగారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఆయన సోమవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు. సర్జరీ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూసుకున్నారన్నారు.

కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్.. తనను సినిమా పరిశ్రమ గురించి అడిగినట్లు చెప్పారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి? ఇండస్ట్రీ ఎలా ఉంది? అని కేసీఆర్ అడిగినట్లు చెప్పారు. ఇక ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ భుజాలపై మెగాస్టార్ చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. ఎదురుగా కనిపించిన కవితకు నమస్కరించారు. కేటీఆర్ ఆయనను లోపలి తీసుకువెళ్లారు.

Related posts

సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం…బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు!

Drukpadam

కిలో టమాటా రూ.2… గిట్టుబాటు ధర లేక 4 ఎకరాల పంటకు నిప్పంటించిన రైతు!

Ram Narayana

రేవంత్‌రెడ్డి అంతు చూస్తాం… అక్కడ చూపిస్తే రాజీనామా చేస్తా: అసెంబ్లీలో కేటీఆర్

Ram Narayana

Leave a Comment