జర్నలిస్టుల సమస్యల పరిష్కరిస్తాం …. టీయూడబ్ల్యూజే నేతలకు సీఎం రేవంత్ హామీ ….
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన టీయూడబ్ల్యూజే నేతలు
అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే జర్నలిస్టులను కలిసేందుకు అంగీకరించిన సీఎం రేవంత్ …
10 సంవత్సరాలుగా జర్నలిస్ట్ సంఘాలను కలవని కేసీఆర్
ఇదిగో అదిగో అంటూ ఇళ్ల స్థలాల విషయంలోనూ అడుగు ముందుకు వేయని ఫైళ్లు…
ఎన్నికలకు ముందు హడావుడి చేసినా, జర్నలిస్టులకు అందని స్థలాలు
ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వరంలో సీఎం రేవంత్ కు అభినందనలు తెలిపిన టీయూడబ్ల్యూజే నేతలు
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టల సమస్యల పరిష్కరానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నిచ్చారు …బుధవారం నూతన ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని టీయూడబ్ల్యూజే ,(ఐజేయూ )జాతీయ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి ఆధ్వరంలో ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయం అంబేద్కర్ భవన్ లోని సీఎం ఛాంబర్ లో కలిసి అభినందించింది …ఈసందర్భంగా ముఖ్యమంత్రిగా ఆయన ఎంపికై భాద్యతలు చేపట్టడం పట్ల సంతోషాన్ని యూనియన్ వ్యక్తం చేసింది …రాష్ట్రంలో దీర్ఖకాలంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిస్కారం కృషి చేయాలనీ నేతలు కోరగా అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ..అదేవిధంగా బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయం దేశోద్ధారక భవన్ లో మీడియా తో గెట్ టు గెదర్ కు ఆహ్వానించగా అంగీకరించారు ….
సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి స్వయంగా అభినందనలు తెలిపేందుకు వందలాది మంది గంటల కొద్దీ వేచి వున్నారు …ప్రభుత్వం మారిన తర్వాత సచివాలయంలోకి వచ్చే వారి సంఖ్య పెరిగిందని వేలాది మంది వస్తున్నారని ఒక సెక్యూరిటీ అధికారి అన్నారు ..గతంలో సాయంత్రం 5 గంటలకే మూడు వంతుల సచివాలయం ఖాళీ అయ్యేదని ఇప్పుడు రాత్రి 9 గంటల వరకు సీఎం ,ఇతర మంత్రులు సచివాలయంలోనే సమీక్షలు ,విజిటర్స్ ను కలిసేందుకు ఉండటంతో వచ్చిన వారు కూడా అప్పటివరకు ఉంటున్నారని ఒక సచివాలయ ఉద్యోగి తెలిపారు …
గత పది సంవత్సరాల కాలంలో జర్నలిస్టుల సమస్యలు పరిస్కారం కోసం అప్పటి సీఎం కేసీఆర్ ను ఎన్ని సార్లు కలిసేందుకు ప్రయత్నం చేసిన సానుకూలంగా స్పందించలేదు…పైగా మీడియా సమావేశాల్లోనూ విలేకర్లు అడిగిన ప్రశ్నలపై ఎదురుదాడి చేయడం , సెటైర్లు వేయడం ,అనేక సార్లు ఇళ్లస్థలాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం,అందమైన కాలనీలు కట్టిస్తామని చెప్పి వాటి ఊసే ఎత్తకపోవడం లాంటి సమస్యలపై జర్నలిస్ట్ సమాజం ప్రభుత్వం పై ఆగ్రహం ఉంది .. ,అక్రిడిటేషన్ల మంజూరి విషయంలో ఇబ్బందులు పెట్టడం ,..జర్నలిస్టుల హెల్త్ స్కిమ్ అమలుకు నోచుకోక అనేక మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి …
దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ పై జర్నలిస్ట్ లోకం గంపెడు ఆశలతో ఉంది …ప్రధానంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కోసం టీయూడబ్ల్యూజే ఐజేయూ దీర్ఘకాలికంగా దీనిపై పోరాటాలు చేస్తుంది…ఇళ్ల స్థలాలు అడిగితె డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని బీఆర్ యస్ ప్రభుత్వం చెప్పింది ….వాటిని పేదలకే సక్రమంగా అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి…కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై జర్నలిస్టులు ఎంతవరకు మేలు చేస్తారు …ఎలాంటి మేలు చేస్తారు అనే ఆసక్తి నెలకొన్నది ….మరి సీఎం జర్నలిస్టులకు ఎలాంటి మేళ్లు చేస్తారో చూద్దాం ….
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారిలో ఐజేయూ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి తో పాటు ,ఐజేయూ కార్యదర్శి వై .నరేందర్ రెడ్డి …టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .విరహత్ అలీ , జాతీయ కార్యవర్గ సభ్యులు కె సత్యనారాయణ , యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె .రాంనారాయణ …రాష్ట్ర యూనియన్ ఉపప్రధాన కార్యదర్శి విష్ణు దాస్ శ్రీకాంత్ ,ఎచ్ యూ జె అధ్యక్షులు సిగ శంకర్ గౌడ్ , యూనియన్ నాయకులూ రాములు తదితరులు పాల్గొన్నారు ..
ఖమ్మం మంత్రులకు టీయూడబ్ల్యూజే నేతల అభినందనలు …
ఖమ్మం జిల్లా నుంచి గెలిచి రాష్ట్ర క్యాబినెట్ లో కీలకమైన స్థానాల్లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు , వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , నాగేశ్వరావు లను శాలువా కప్పి బొకేలతో సత్కరించి అభియానందించారు … ఈ సందర్భంగా మంత్రులు ఎప్పుడు ఏ సమస్య ఉన్న తమ దగ్గరకు రావచ్చునని అన్నారు ….మంత్రులను కలిసిన వారిలో జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ ,ఉపాధ్యక్షులు కె .రాంనారాయణ , జాతీయ కార్యవర్గ సభ్యులు కె .సత్యనారాయణ ,ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కన్వినింగ్ కమిటీ సభ్యులు నేర్వనేని వెంకట్రావు , ఖదీర్ , టీయూడబ్ల్యూజే ఖమ్మం జిల్లా నగర నాయకులు ఎన్. శివానంద , సిఎచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు …