Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఖమ్మం లోకసభ నుంచే సోనియాగాంధీని పోటీచేయించాలనే ఆలోచనలో టీపీసీసీ ….?

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది… ఆమె అంగీకరిస్తే ఖమ్మం పార్లమెంట్ నుండి సోనియాగాంధీని బరిలోకి దించాలనే యోచనలో టిపిసిసి ఉన్నట్లు సమాచారం … ఖమ్మం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది…ఖమ్మంలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతోపాటు ,ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆయా ఆయా నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో ఎన్నికైయ్యారు …దీంతో ఖమ్మం నుంచి సోనియా పోటీచేస్తే ఆమె సులువుగా గెలవడంతోపాటు ఆమె పోటీ రాష్ట్ర రాజకీయాలపై పడుతుందని కాంగ్రెస్ అభిప్రాయం పడుతుంది…అందుకు సోనియా అంగీకరిస్తారా …? లేదా అనేది కూడా సందేశంగా ఉంది …ఒక వేళ సోనియా గాంధీ ఎన్నికల్లో పోటీచేయకపోతే ప్రియాంక గాంధీని పోటీచేయించే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం … సోమవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలు ,ఆరు గ్యారంటీల అమలు , లాంటి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు … ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో గతంలో రెండింతల స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో ఉంది…దీంతో ఇప్పటి నుంచే లోకసభ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది…

గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. 5 అంశాల ఎజెండాగా సాగిన పీఏసీ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, 6 గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సీట్లు తగ్గడంపైనా సమాలోచనలు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పీఏసీ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో పాటు గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తీర్మానించింది. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ఏఐసీసీ నేతలకు ధన్యవాదాలు తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని మాణిక్​రావు ఠాక్రే అభినందించారు. తమ పార్టీ విధానాలను, హామీలను ప్రజలు పూర్తిగా విశ్వసించారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణలో మంచి విజయం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ క్రమంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. మంచి విజయాలు అందేలా మనం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

Related posts

ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. కొందరు యాంకర్లు.. టీవీ షోల బాయ్‌కాట్

Ram Narayana

కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే చోటు…!

Ram Narayana

రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర డిప్యుటీ సీఎం ఫడ్నవీస్.. వారించిన అమిత్ షా…

Ram Narayana

Leave a Comment