Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

లోకేశ్ కు క్రిస్మస్ కానుకలు పంపిన షర్మిల…. ఫొటోలు ఇవిగో!

  • రేపు క్రిస్మస్
  • నారా లోకేశ్ కు ఊహించని వ్యక్తి నుంచి కానుకలు
  • ముగ్ధుడైన నారా లోకేశ్
  • షర్మిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన వైనం
YS Sharmila sent Nara Lokesh Christmas gifts

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పైగా ఇది ఎవరూ ఊహించని విషయం కూడా. ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు క్రిస్మస్ కానుకలు పంపారు. “వైఎస్సార్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది… ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి… మీకు 2024లో అంతా శుభం కలగాలి” అంటూ షర్మిల సందేశం పంపారు. 

షర్మిల కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేశ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. 

“ప్రియమైన షర్మిల గారూ… మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు, నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకాంక్షలు తెలుపుతోంది” అంటూ లోకేశ్ బదులిచ్చారు.

Related posts

తీవ్రంగా కలచివేసింది: గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ లేఖ

Ram Narayana

వేగం తీసిన ప్రాణం.. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి..!

Ram Narayana

కేవీపీకి కౌంటర్ ఇచ్చిన వీహెచ్

Ram Narayana

Leave a Comment