Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

విశాఖలో దారుణం.. బాలికపై 10 మంది అత్యాచారం

  • హోటల్‌కు తీసుకెళ్లి తొలుత ప్రియుడు, ఆ తర్వాత అతడి స్నేహితుడి అఘాయిత్యం
  • మనస్తాపంతో ఆర్కే బీచ్‌లో రోదిస్తున్న బాలికను లాడ్జ్‌కి తీసుకెళ్లి రేప్ చేసిన ఓ ఫొటోగ్రాఫర్
  • మరో ఎనిమిది మంది స్నేహితులను పిలిపించి రెండు రోజులపాటు లాడ్జ్‌లోనే అత్యాచారపర్వం
  • ఉపాధి కోసం విశాఖ వచ్చిన ఒడిశా బాలికకు ఎదురైన దారుణం
  • నిందితుల నుంచి తప్పించుకొని స్వగ్రామం వెళ్లిన బాధిత బాలిక
Gang rape on girl in Visakapatnam

విశాఖపట్నంలో దారుణం వెలుగుచూసింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన ఓ దళిత బాలికకు ఈ పరిస్థితి ఎదురైంది. ప్రేమ పేరిట తొలుత ప్రియుడు, అతడి స్నేహితుడు అత్యాచారం చేయగా.. ఆ తర్వాత మరో ఎనిమిది మంది మృగాళ్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరిన బాలికకు భువనేశ్వర్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ నెల 18న బాలికను ప్రియుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం స్నేహితుడిని కూడా హొటల్‌కు పిలిచి అత్యాచారం చేయించాడు. ప్రియుడు నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడంతో మనస్తాపానికి గురవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బాలికకు ఊహించని మరో దారుణం ఎదురైంది. 

ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్‌కు వెళ్లి ఏడుస్తున్న బాధిత బాలికపై పర్యాటకుల ఫొటోలు తీసే ఓ ఫొటోగ్రాఫర్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి నగరంలోని జగదాంబ కూడలికి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. గదిలోనే బంధించి తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఫొటోగ్రాఫర్‌ సహా ఎనిమిది మంది ఈ దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజులపాటు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. 

కాగా బాధిత బాలిక లాడ్జి నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులతో కూడా పంచుకోలేదు. అయితే విశాఖలో పనిచేసిన ఇంటివారు 18వ తేదీనే బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ పట్టణ స్టేషన్ పోలీసులు 22న ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు. అప్పుడు బాలిక అసలు విషయాన్ని చెప్పింది. తనకు ఎదురైన పరిస్థితిని వివరించింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. నగరానికి చెందిన ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇక తొలుత అత్యాచారానికి పాల్పడిన ప్రియుడు, అతడి స్నేహితుడు పరారయ్యారని, ఇద్దరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఝార్ఖండ్‌, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారని సమాచారం.

Related posts

2 వేల సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి సీరియల్ కిల్లర్ ను పట్టుకున్న పోలీసుల

Ram Narayana

Meet the Nokia 8 — The First Android Flagship From The Iconic Brand

Drukpadam

మహా ఉగ్ర గోదారి ….భద్రాచలం వద్ద 71 అడుగులు…ఇక శాంతించే అవకాశం!

Drukpadam

Leave a Comment