Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

నేను జగన్‌ కాళ్లు మాత్రమే పట్టుకుంటా.. విమర్శలకు బదులిచ్చిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి

  • ఎవరి కాళ్లు పడితే వారివి పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్న డిప్యూటీ సీఎం
  • జగన్ తనకు ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టే జగన్ కాళ్లు పట్టుకుంటానన్న నారాయణస్వామి
  • నమ్మకస్తులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని వేడుకోలు

ఎవరి కాళ్లు పడితే వారివి పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, తనకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్ కాళ్లు తప్ప మరెవరివీ పట్టుకోబోనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. తాను కాళ్లు పట్టుకుంటానంటూ వస్తున్న విమర్శలకు ఆయనిలా బదులిచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఇప్పుడు వస్తున్నవారు ఒకప్పుడు జగన్ ను విమర్శించారని, కాబట్టి నమ్మకస్తులకు టికెట్లు ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తున్నట్టు చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెనుమూరులో ఓ పెద్దాయనకు బీఫారాలు ఇస్తే ఇప్పుడు ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్సార్‌పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆదివారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నిన్నటి నుంచీ వైరల్ అవుతున్నాయి.

Related posts

వాచ్ మన్ రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు!

Ram Narayana

రాజకీయ దుమారం రేపుతున్న పవన్ పై కవిత వ్యాఖ్యలు

Ram Narayana

మోత మోగిద్దాం…. వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చిన నారా లోకేశ్

Ram Narayana

Leave a Comment