Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మమతా బెనర్జీ పై అధిర్ రంజన్ అనుచిత వ్యాఖ్యలు… స్పందించిన రాహుల్ గాంధీ

మమతా బెనర్జీపై సొంత పార్టీ నేత విమర్శలు… తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ

  • మమతా బెనర్జీ అవకాశవాది.. మా సహకారంతోనే గెలిచారన్న కాంగ్రెస్ నేత అధిర్ రంజన్
  • కొన్నిసార్లు మా పార్టీ నేతలు ఏదేదో మాట్లాడుతుంటారు.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రాహుల్ గాంధీ
  • మమతా బెనర్జీ తనకు అత్యంత ఆత్మీయురాలు అన్న కాంగ్రెస్ అగ్రనేత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు అత్యంత ఆత్మీయురాలు… కొన్నిసార్లు మా పార్టీ నేతలు ఏదేదో మాట్లాడుతుంటారు… వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన అసోంలో ఉన్నారు. మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసి రాహుల్ గాంధీ స్పందించారు. 

ఏం జరిగింది?

బెంగాల్‌లోని 42 లోక్ సభ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ… మమతా బెనర్జీ అవకాశవాది అని విమర్శించారు. మమత కారణంగా తాము ఎన్నికల్లో ఓడిపోయామని, సొంత బలంతో పోటీ చేసి గెలవడం తమ పార్టీకి తెలుసునని వ్యాఖ్యానించారు. మా పార్టీ అధికారంతోనే ఆమె గద్దెనెక్కారనే విషయం గుర్తించాలన్నారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు.

ఇదిలా ఉండగా… సీట్ల పంపకాల్లో భాగంగా 42 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు ఇచ్చేందుకే మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నారని, కానీ కాంగ్రెస్ మరిన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి.

Related posts

కూటమి భేటీకి ముందు ఆప్ నేత కీలక వ్యాఖ్యలు!

Ram Narayana

వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోరుతూ కరపత్రాలు ప్రింట్ చేయించిన పోలీసు అధికారి.. విధుల నుంచి తొలగింపు

Ram Narayana

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ… సీడబ్ల్యూసీ తీర్మానం…

Ram Narayana

Leave a Comment