కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో వైఫల్యం
పంటపొలాలకు నీళ్లు ఇవ్వలేక పోతున్న కాంగ్రెస్
కరెంటు కు కష్టకాలమే …
నామ ప్రచార సభలో పాల్గొన్న పలువురు బీఆర్ యస్ నేతలు
తీవ్ర కష్టనష్టాలలో ఉన్న రైతన్నలతో కలిసి బీఆర్ఆర్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వారి న్యాయమైన హక్కుల సాధనకు పోరాడుతున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ఆచరణలో పండుగ చేసి నిరూపించిన గొప్ప పాలనాదక్షులు, నాయకులు కేసీఆర్ అని ఆయన కొనియాడారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, పార్టీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు తాతా మధు,రేగా కాంతారావు,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,తాటి వెంకటేశ్వర్లు,మెచ్చా నాగేశ్వరరావు తదితరులతో కలిసి ములకలపల్లి మండలం నర్సాపురంలో మంగళవారం జరిగిన ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,ఇప్పటి పాలకులకు నీటి యాజమాన్య పద్దతులు తెలియక సకాలంలో సాగునీరందిక పంటలు ఎండిపోవడానికి ప్రధాన కారకులయ్యారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన విషయాన్ని గుర్తు చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పాలకులు ఆచరణలో అమలు చేయలేకపోతున్నారని నిశితంగా దుయ్యబట్టారు.తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన,ప్రజల న్యాయమైన హక్కుల కోసం లోకసభలో నిరంతరం గొంతువిప్పే నామ నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తున్నారని, మనమందరం మరింత ఐకమత్యంతో భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఎంపీ రవిచంద్ర పిలుపునిచ్చారు.నామతో పాటు తెలంగాణలోని 10నుంచి 12సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమైందని ఎంపీ వద్దిరాజు ధీమాగా చెప్పారు.ఈ సమావేశంలో జెడ్పీటీసీలు వెంకట్ రెడ్డి,నాగమణి, ఎంపీపీలు శ్రీరామమూర్తి,మల్లె నాగమణి, పలువురు ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు, నాయకులు, ప్రముఖులు, గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం టీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపిద్దాం”అనే నినాదాలు హోరెత్తాయి.