ఖమ్మం లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జనలు
కేసి వేణుగోపాల్ తో కలిసి ఢిల్లీ నుంచి వచ్చిన ఎంపీ రేణుకాచౌదరి
ఖమ్మం సీటు విషయంలో ఇంకారాని స్పష్టత
తేల్చుకోలేక పోతున్న జిల్లా మంత్రులు
పోట్ల ,రాయల పోటాపోటీగా ప్రయత్నాలు
ఖమ్మం లోకసభ అభ్యర్థి ఎంపిక విషయంలో అటు అధిష్టానం , ఇటు రాష్ట్ర నేతలు , జిల్లా మంత్రులు ఒక స్పష్టతకు రాలేక పోతున్నారని సమాచారం … ఎవరిని పెట్టాలి …ఎవరికీ అంగబలం అర్ధబలం ఉంది … అనేది కూడా ఒక అంశంగా చర్చలో ఉన్నట్లు వినికిడి … ఇక కమ్మసామాజిక వర్గం అయితే ఎవరు …? కాకపోతే ఎవరు …?అనేది ఆసక్తిగా మారింది… పోట్ల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వరరావులు ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు .. మంత్రుల కుటుంబసభ్యులకు నో చెప్పడంతో వారు అనూహ్యంగా రంగంలోకి వచ్చారు … జిల్లా మంత్రులపై వీరువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు …రేణుకాచౌదరి కూడా హైకమాండ్ వద్ద ఖమ్మం విషయం చర్చించినట్లు సమాచారం …
ఆదివారం రాత్రి 7 .30 గంటలకు హైద్రాబాద్ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నేరుగా ఒక హోటల్ కు వెళ్లారు …ఆయన వెంట రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి కూడా ఢిల్లీ నుంచి వచ్చారు …ఖమ్మం లోకసభకు ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే అంశంపై ఆమె తన అభిప్రాయాలను కేసి వేణుగోపాల్ కు కూడా చెప్పినట్లు తెలుస్తుంది …అయితే హైద్రాబాద్ లో ఇప్పటికే ప్రకటించిన లోకసభ అభ్యర్థులు , ఇంచార్జిలు ,రాజకీయ సలహా కమిటీ సభ్యులు , మంత్రులు ,సీనియర్ నేతలతో కేసి వేణుగోపాల్ చర్చించి దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది …ఇప్పటికే నేతలంతా హైద్రాబాద్ చేరుకున్నారు …
ఖమ్మం నుంచి ఎవరిని పోటీకి పెట్టాలని తర్జన భర్జనలు జరుగుతున్నాయి…ప్రధానంగా పోట్ల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వరరావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు సమాచారం …జిల్లాకు చెందిన మంత్రులు తమ కుటుంబసభ్యులకు ఇవ్వకపోవడంతో ఎవరి పేరు చెప్పాలనే దానిపై ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు …నిన్నమొన్నటివరకు ఖమ్మం సీటుపై ఆశలు పెట్టుకున్న అనేక మంది ఆశావహులు తమకు రాదని వెనక్కు తగ్గారు …కుటుంబసభ్యులకు రావడంలేదని తెలిసి పోట్ల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వరరావు పేర్లు కొత్తగా రంగంలోకి వచ్చాయి…ఇందులో ముగ్గరు మంత్రులు ఎవరికీ మొగ్గు చూపుతారు అనేదాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది …సీఎం మాత్రం ఖమ్మం విషయంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేరు … ఇక రేణుకాచౌదరి మంత్రాంగం ఎంతవరకు ఫలిస్తుంది ఆమె అధిష్టానం పెద్దలకు ఏమి చెప్పారు …ఎవరివైపు మొగ్గు చూపుతున్నారు అనే దానిపై ఆధారపడి ఖమ్మం లోకసభ అభ్యర్థి ఎంపిక జరుగుతుంది …తాజాగా రంగంలోకి వచ్చిన వారిని కాదని పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి , లేదా రఘుమారెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది …
కాంగ్రెస్ కార్యకర్తల్లో పెరుగుతున్న అసహనం
బీఆర్ యస్ , బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మునిగి తేలుతుండగా తమ పార్టీ ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఉండటంపై కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం పెరుగుతుంది …ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో ముందుండగా తమ పార్టీ చేస్తున్న జాప్యం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు …అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సంపాందించిన కాంగ్రెస్ పార్టీకి లోకసభలో ఎన్ని ఓట్లు వస్తాయి…? అనే సందేహాలు కూడా ఉన్నాయి…కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దామని అనుకున్నవాళ్ళు కూడా అభ్యర్థి ఎంపిక చేస్తున్న జాప్యం వల్ల తమ అభిప్రాయాలను మార్చుకునే అవకాశాలు లేకపోలేదని చర్చలు జరుగుతున్నాయి…