Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం: ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి

  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టి తీరుతామన్న ముఖ్యమంత్రి
  • మోదీ, కేడీ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేదని విమర్శ
  • ఐదు గ్యారెంటీలను అమలు చేశాం… మిగతా హామీలను కూడా అమలు చేస్తామన్న సీఎం

త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జన జాతర సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని…. అక్కడి ముంపు ప్రాంతాలపై ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. మోదీ, కేడీ పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేదని విమర్శించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

అధికారంలోకి వస్తే ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రధాని మోదీ చెప్పారన్నారు. జన్ ధన్ ఖాతాలో డబ్బులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఐదు గ్యారెంటీలను అమలు చేశామని… మిగతా హామీని కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైందని… అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. పేదలకు అండగా నిలబడిన వారికి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక్కడి నాగోబా జాతరకు రూ.6 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామన్నారు.

Related posts

ఎంపీ వద్దిరాజుకు ఇల్లందు నియోజకవర్గంలో ఘన స్వాగతం…

Ram Narayana

అదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్!

Ram Narayana

కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి… కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

Ram Narayana

Leave a Comment