Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కిర్గిజ్‌స్థాన్‌‌లో తెలుగు విద్యార్థి మృతి…

  • విహార యాత్రలో విషాదం
  • మంచులో కూరుకుపోవడంతో దాసరి చందు అనే విద్యార్థి మృతి
  • వైద్య విద్య కోసం ఏడాది కిందటే కిర్గిజ్‌స్థాన్ వెళ్లిన చందు
  • అనకాపల్లిలోని మాడుగులకు చెందిన విద్యార్థి

విదేశాల్లో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదం వెలుగుచూసింది. కిర్గిజ్‌స్థాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న దాసరి చందు (20) అనే తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు ఆదివారం విహారయాత్రకు తీసుకెళ్లారు. దగ్గరలో ఉన్న మంచు జలపాతం సందర్శనకు తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు సరదాగా జలపాతంలోకి దిగారు. అయితే ఊహించని విషాదం జరిగింది. ప్రమాదవశాత్తూ దాసరి చందు మంచులో కూరుకుపోయాడు. బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు సాయి చందు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

కాగా దాసరి చందు స్వస్థలం అనకాపల్లి జిల్లాలోని మాడుగుల అని కుటుంబ సభ్యులు తెలిపారు. చందు తండ్రి భీమరాజు హల్వా వ్యాపారి అని, చందు రెండవ కుమారుడు అని తెలిపారు. ఎంబీబీఎస్‌ చదివేందుకు ఏడాది కిందట కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లాడని వివరించారు. చందు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సాయం చేస్తున్నారని అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారని ఆమె చెప్పారు.

Related posts

నమ్మశక్యం కానివార్త… దక్షిణ కొరియాలో రోబో ‘ఆత్మహత్య’!

Ram Narayana

అమెరికాలో హిందూ దేవాలయం గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు

Ram Narayana

భారత్ గర్వించదగ్గ పుత్రుడు రతన్ టాటా …ఇజ్రాయేల్ ప్రధాని

Ram Narayana

Leave a Comment