ఖమ్మం జిల్లా బీఆర్ యస్ యూత్ అధ్యక్షుడు కృష్ణ చైతన్య పార్టీకి గుడ్ బై …కేసీఆర్ కు లేఖ!
జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుకు కాపీ
రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ లోకి
తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అంటూ లేఖలో పేర్కొన్న చైతన్య
ఖమ్మం జిల్లా బీఆర్ యస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆపార్టీకి గుడ్ బై చెప్పారు …ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కేసీఆర్ కు లేఖ రాశారు …దానిప్రతిని ఖమ్మం జిల్లా బీఆర్ యస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుకు పంపారు …
అంతకు ముందు టీడీపీలో ఉన్న కృష్ణ చైతన్య టీడీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడుగా వ్యవహరించారు …. తుమ్మలతోపాటు బీఆర్ యస్ చేరారు … దశాబ్దకాలంగా కృష్ణ చైతన్య బీఆర్ యస్ లో చురుకైన నాయకుడిగా వ్యహరించారు …ఆయన చురుకుదనం చూసి పార్టీ జిల్లా యూత్ వింగ్ భాద్యతలు మూడు సంవత్సరాల క్రితం అప్పగించింది ….పార్టీలో ఆయన తుమ్మల వర్గంలో ఉండి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ లకు అనుచరుడిగా ఉన్నారు … వారితోపాటే బీఆర్ యస్ లో చేరారు …గత ఎన్నికల్లో ఆయన సత్తుపల్లి , మధిర నియోజకవర్గాల్లోనే ప్రచారం చేశారు …అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కృష్ణ చైతన్య కూడా ఇక బీఆర్ యస్ లో ఉంటె లాభం లేదని భావించి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది … మొదటి నుంచి ఆయన బాలసాని లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు …అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాలసానితోపాటు కృష్ణ చైతన్య కూడా పార్టీని వీడతారని అనుకున్న బీఆర్ యస్ తిరిగి అధికారంలోకి వస్తుందని భావించి అందులోనే ఉన్నారు …పార్టీ అధికారం కోల్పోవడం ఆయనకు ఇష్టమైన నాయకులు తుమ్మల, బాలసాని లు కాంగ్రెస్ లో ఉండటంతో ఇక బీఆర్ యస్ లో ఇమడలేనని భావించి రాజీనామా చేశారు …రెండు, మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు …