Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో గుమ్మంలో ఎవరి జెండా ఎగురుతుంది …

లోకసభ ఎన్నికల్లో ఖమ్మం గుమ్మంలో ఎవరి జెండా ఎగురుతుంది …ముక్కోణపు పోరులో ప్రజలు ఎవరికీ జైకొడతారు …కాంగ్రెస్ కంచుకోటలో ఆపార్టీని కనికరిస్తారా …?లేక బీఆర్ యస్ అభ్యర్థికి పట్టం కడతారా …?? బీజేపీని ఆదరిస్తారా …??? అనేది ఆసక్తిగా మారింది …ఖమ్మం అనగానే కమ్యూనిస్టులు గుర్తుకు వస్తారు …ఒకప్పుడు వారు ప్రధానశక్తి …డిసైడింగ్ ఫాక్టర్ …నేడు అధిలేకపోయిన గెలుపోటములను నిర్ణయించే సత్తా వారికీ ఉంది..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటింగ్ కలిగిన సిపిఎం , సిపిఐ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నందున కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాయి…దీనికి తోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ , ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి గెలుపొందారు ..ఇదే నియోజకవర్గం నుంచి రాష్ట్ర క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క , కీలకమైన ,వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవరిస్తున్నారు …కాంగ్రెస్ గెలుపు మంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారింది … అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఈపార్లమెంట్ పరిధిలో 2 .50 లక్షల మెజార్టీ వచ్చింది .. ఈలెక్కన చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే …కానీ ఆపార్టీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి…పైగా అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కొంత మైనస్ గా మారింది ..
చివర క్షణంలో మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి తనయుడు రఘురాంరెడ్డిని బరిలోకి దించారు … నామినేషన్లు వేసిన దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు , కాంగ్రెస్ ,సిపిఐ , సిపిఎం కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు …జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఖమ్మం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోని పనిచేస్తున్నారు …దీంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమాతో ఉంది …

బీఆర్ యస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో చిత్తూ చిత్తుగా ఓడిపోయింది …దీంతో ఇక్కడ బీఆర్ యస్ గెలవడం సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి…2019 ఎన్నికల్లో బీఆర్ యస్ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న 17 నియోజకవర్గాల్లో 8 చోట్ల ఓడిపోయింది …రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు ఈ ఎన్నికలు ఒక పరీక్షలాంటివే …ఈపరీక్షలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది …మొత్తం 16 లక్షల 26 వేల ఓట్లు ఉండగా 12 నుంచి 13 లక్షల మధ్య ఓట్లు పోలైయ్యే అవకాశం ఉంది …వీటిలో ఎవరికీ ఐదున్నర లక్షల నుంచి 6 లక్షల ఓట్లు వస్తాయో వారు గెలుపొందుతారు …రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ యస్ రోజురోజుకు బలహీన పడుతుంది ….ఇక్కడ పోటీచేస్తున్న బీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ నాగేశ్వరరావు కు సౌమ్యుడుగా పేరుంది …పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించారు …జిల్లాలో విస్తృత సంబంధాలు కలిగి ఉన్నారు …బీఆర్ యస్ బలహీనపడిన నామకు ఉన్న మంచి పేరు కలిసి వస్తుందని ఆపార్టీ అంచనా వేస్తుంది …

ఈసారి బీజేపీ అభ్యర్థికి కూడా ఓట్లు గణనీయంగానే వస్తాయని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు …మోడీ హవా పెద్దగా ఖమ్మం నియోజకవర్గం పై లేకపోయినా అయోధ్యలో రాముడి గుడినిర్మాణం కొంత పనిచేసే అవకాశాలు తోసిపుచ్చలేమనే అభిప్రాయాలు ఉన్నాయి…ఊరూరూ పంపిన అయోధ్య తలంబ్రాలు బీజేపీ పంపిందని ప్రజలు నమ్ముతున్నారు …అది కొంత వాస్తవం కూడా కావచ్చు …ప్లాన్ ప్రకారమే రాజకీయ లబ్దికోసం చేసి ఉండవచ్చు అనే అభిప్రాయాలు లేకపోలేదు …ఖమ్మం నియోజకవర్గంలో గతంలో పోటీచేసిన ఏ బీజేపీ అభ్యర్థి ఇంత పకడ్బందీగా ప్రచారం చేసిన సందర్భంలేదు …మంచి వ్యూహరచనతో ప్రణాళిక బద్దంగా ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రచారం చేస్తున్నారు … ప్రజల్లో ఏ నోట విన్న బీజేపీకి గెలుపు సంగతి పక్కన పెడితే ఓట్లు పెరగటం ఖాయమనే అంటున్నారు …టీడీపీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరినందున టీడీపీ బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది …దీంతో తమకు టీడీపీ నిర్ణయం కలసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తుంది ….

బీజేపీ లో పోటీలో ఉన్న ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ యస్ లమధ్యనే ఉండే అవకాశం ఉంది …ఓటర్ల నాడీ ఎవరికీ అనుకూలంగా ఉంటుంది … అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుందా …? లేక ప్రతిపక్ష అభ్యర్థికి పట్టం కడుతుందా ..? అనేది చూడాల్సి ఉంది ..

తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాలలో ఖమ్మం ఒకటి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఖమ్మం సీటులో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేటతో సహా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నియోజకవర్గం ఒక సాధారణ స్థానం. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, ఐఎన్‌సీ ప్రధాన పార్టీలు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి నామా నాగేశ్వర్‌రావు 1,68,062 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నామా నాగేశ్వర్ రావు 50.00% ఓట్లతో 567,459 ఓట్లను సాధించారు మరియు INC నుండి 399,397 ఓట్లు (35.04 %) పొందిన రేణుకా చౌదరిని ఓడించారు.

2014 లోక్‌సభ ఎన్నికలలో, YSRCP నుండి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 35.53% ఓట్లతో 422,434 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 410,230 ఓట్లు (34.51%) సాధించి రన్నరప్‌గా నిలిచారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి 12,204 ఓట్ల తేడాతో నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు…

1952 నుంచి ఇప్పటివరకు ఖమ్మం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుల-వివరాలు

======================================================================

సంవత్సరం సభ్యుడు పార్టీ

1952 టిబి. విట్టల్ రావు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్)
1957 టిబి. విట్టల్ రావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962 టి.లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్
1967 టి.లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్
1971 టి.లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్
1977 జలగం కొండల రావు కాంగ్రెస్
1980 జలగం కొండల రావు కాంగ్రెస్
1984 జలగం వెంగళరావు కాంగ్రెస్
1989 జలగం వెంగళరావు కాంగ్రెస్
1991 పివి రంగయ్య నాయుడు కాంగ్రెస్
1996 తమ్మినేని వీరభద్రం సిపిఎం
1998 నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్
1999 రేణుకా చౌదరి కాంగ్రెస్
2004 రేణుకా చౌదరి కాంగ్రెస్
2009 నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2014 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2019 నామా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి

Related posts

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్..రఘునాథపాలెం సర్పంచ్ పార్టీకి గుడ్ బై…

Ram Narayana

సీఎం కేసీఆర్డీ పెద్దమనసు …ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ కు 22 కోట్ల బకాయిలు విడుదల …ఎంపీ వద్దిరాజు

Ram Narayana

ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు…పొంగులేటి

Ram Narayana

Leave a Comment