ఆంధ్రప్రదేశ్

మల్లన్న గెలుపుకు సహకరించాలి …సిపిఎం , సిపిఐ, పార్టీలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి ..!

ఖమ్మం , నల్గొండ , వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నికలో చింతపండు నవీన్ ఎలియాస్ తీన్మార్ మల్లన్న గెలుపుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం , సిపిఐ పార్టీలకు విజ్ఞప్తి చేశారు …శనివారం హైద్రాబాద్ లో ఆపార్టీ నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి గెలుపు ఆవశ్యకత గురించి నేతలు వివరించారు …రాష్ట్ర రాజకీయ పరిస్థితులు , బీజేపీ ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు చర్చించారు …పట్టభద్రుల ఉపఎన్నిక జరుగుతున్నఉమ్మడి ఖమ్మం , నల్గొండ , వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉండటంతో వారి అవసరాన్ని గుర్తించిన సీఎం వారితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది …

సీఎం తో సమావేశంలో సిపిఐ సిపిఎం తోపాటు టీజేఎస్ నేతలు కూడా పాల్గొన్నారు … సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యంగా నల్గొండ ఖమ్మం జిల్లాల్లో బలంగా ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతల ద్వారా గ్రాడ్యుయేట్లకు మరింత చేరువ కావాలని సిఎం వారిని కోరారు ఈ సమావేశం ప్రొ కోదండరామ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పల్లా వెంకటరెడ్డి సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి బాగం హేమంతరావు , మల్లు రవి, వేం నరేందర్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

Related posts

అమరావతి సమీపంలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ… సీజేఐ చేతులమీదుగా శంకుస్థాపన

Ram Narayana

బాపట్ల జిల్లాలో క్రైమ్ సీన్… భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు!

Ram Narayana

ఆస్తులన్నీ సునీత పేరున బాబాయ్ రాశారు.. ఆస్తుల గొడవే అయితే సునీతను చంపేవాళ్లు: వైఎస్ షర్మిల…

Drukpadam