ప్రమాదాలు ...

రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూలిన స్టేజీ…

  • పాట్నా శివారులోని పాలీగంజ్ బహిరంగసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ
  • వేదికపైకి వచ్చిన తేజస్వి యాదవ్, రాహుల్, మీసా భారతి
  • హఠాత్తుగా కిందకు పడిపోయిన స్టేజీ
  • అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభలో స్టేజీ కూలింది. అయితే రాహుల్ గాంధీ సహా ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బీహార్‌లోని పాటలీపుత్ర లోక్ సభ స్థానానికి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా పాట్నా శివారులోని పాలీగంజ్‌లో బహిరంగసభలో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, మీసా భారతి తదితరులు వేదిక పైకి చేరుకున్నారు. ఈ సమయంలో వేదిక ఒక్కసారిగా కాస్త కిందకు పడిపోయింది. దీంతో రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది అతనిని కిందకు దించే ప్రయత్నాలు చేశారు. దానికి ఆయన వద్దని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. స్టేజ్ కూలిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Related posts

మైత్రివనం ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్ని ప్రమాదం… తప్పిన ముప్పు…

Ram Narayana

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడడంతో 36 మంది దుర్మరణం..!

Ram Narayana

బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలు!

Ram Narayana