Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పవన్ కల్యాణ్ అనే నేను అనగానే చప్పట్లు, కేకలతోో మార్మోగిన సభా ప్రాంగణం…

‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు.

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

లోకేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం
ఆయన టెక్కలి నియోజకవర్గం నుంచి 2024లో భారీ మెజారిటీతో విజయం
1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలుపు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024 లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుకి అచ్చెన్న సోదరుడు. 1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలిచారు. ఆ తర్వాత కూడా 1999, 2004 లలో హరిశ్చంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014, 2019 లలో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతల దాడిలో టీడీపీ నాయకుడు పులివర్తి నాని గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయాల నుంచి నాని ఇంకా కోలుకోలేదు. అయితే, తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పులివర్తి నాని హాజరయ్యారు. కాలికి పట్టీతో వీల్ చెయిర్ లో వచ్చారు. కేసరపల్లి సభావేదిక వద్దకు పులివర్తి నాని వీల్ చెయిర్ లో వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలనకు వెళ్లారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ ను పరిశీలించి తిరిగి వస్తుండగా.. వైసీపీ శ్రేణులు నానిపై దాడికి దిగాయి. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ తెదేపా నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

Related posts

రూ.10 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో ఏడాదిలో కోటి ట‌ర్నోవ‌ర్‌!..

Drukpadam

దాడిలో త‌మ ఇంజినీర్లు చ‌నిపోయినందుకు పాక్ నుంచి చైనా భారీగా ప‌రిహారం డిమాండ్‌…

Drukpadam

ఎన్టీఆర్ ను చూసి “సీఎం, సీఎం” అంటూ అరిచిన అభిమానులు

Drukpadam

Leave a Comment