పది రోజుల్లో మళ్లీ వస్తా..పనుల్లో పురోభివృద్ధి లేకపోతే చర్యలు తప్పవు…మంత్రి పొంగులేటి!
పనుల్లో పురోభివృద్ధి లేకపోతే చర్యలు తప్పవు…!!
నాణ్యత లోపించినా ఊరుకునేది లేదు
మున్నేరు ఆర్సీ వాల్స్ సందర్శనలో అధికారులతో మంత్రి పొంగులేటి
ఇప్పటికే నాలుగు నెలల ఆలస్యం అయింది…. ఆర్సీ వాల్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయండి…. ఇందుకోసం ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడండి…. పది రోజుల్లో మళ్లీ వస్తా…. పనుల్లో పురోభివృద్ధి లేకపోతే చర్యలు తప్పవు…. నాణ్యత లోపించినా ఊరుకునేది లేదంటూ తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులతో పేర్కొన్నారు. దానవాయిగూడెంలో మున్నేరు ఆర్సీ వాల్స్ నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవో గణేష్ తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ…. యుద్ధప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు మున్నేరుకు ఇరువైపులా ఉన్న ప్రభత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని సూచించారు. గోళ్లపాడు సైడ్ డ్రైన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించాలని ఆదేశించారు. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ లను గుర్తించి సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులను చేపట్టాలని, తద్వారా మురికి నీరు మున్నేరులో చేరకుండా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రామ్మూర్తి నాయక్, రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళ్లెం వెంకట్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…నాణ్యత లోపించినా ఊరుకునేది లేదు
మున్నేరు ఆర్సీ వాల్స్ సందర్శనలో అధికారులతో మంత్రి పొంగులేటి అన్నారు …