Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు..

పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం నగరంలో ఈనెల 19- 20 తేదీల్లో జరగనున్న టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మహాసభలు జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్తు పోరాటాలకు దిశా నిర్దేశం చేయనున్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహతలి పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను పరిశీలించేందుకు మరి కొంతమంది రాష్ట్ర నాయకులతో కలిసి వారు ఖమ్మం వచ్చిన సందర్భంగా డిపిఆర్సి భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం పోరాటాల గడ్డ అని ఏపీయూడబ్ల్యూజే ఉండగా రెండుసార్లు రాష్ట్ర మహాసభలు ఇక్కడే జరిగాయని, మళ్లీ ఇప్పుడు టి యు డబ్ల్యూ జే ఐ జే యు మూడవ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం జిల్లా ఆతిథ్యమిస్తోందని వారు అన్నారు. దేశంలోనే జర్నలిస్టు సమస్యలపై పోరాడే అతిపెద్ద సంఘం ఐజేయుకు అనుబంధంగా ఉన్న టి యు డబ్ల్యూ మహాసభలు ఖమ్మంలో జరగడం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ మహాసభలో గ్రామీణ విలేకరులకు మినిమం హానరరీ తో పాటు వేజ్ బోర్డు అమలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ, అదే సందర్భంలో వివిధ పత్రికలు మీడియా యాజమాన్యాల తీరు తదితర అంశాలపై మహాసభలో చర్చించి 12 తీర్మానాలను ఆమోదించనున్నట్లు చెప్పారు. దశాబ్దాల సుదీర్ఘ జర్నలిస్టుల పోరాటాలు దేశస్థాయిలో ఐజేయు సాధించిన విజయాలు తదితర అంశాలపై రూపొందించిన సిడిని ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. ఖమ్మంలో మహాసభలు నిర్వహించే ప్రాంగణానికి జర్నలిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలం పోరాటం చేసిన రాష్ట్ర నాయకులు అమర్నాథ్ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు.

మహాసభలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ హాజరవుతారు అన్నారు. విశిష్ట అతిధి మీడియా అకాడమీ చైర్మన్ ఐజేయు జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి, గౌరవ అతిథులుగా ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము, ఐజ యు మాజీ అధ్యక్షులు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్ఎన్ సిన్ హ, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, ప్రత్యేక అతిథులుగా రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి వద్దిరాజు రవిచంద్ర బండి పార్థసారథి రెడ్డి ఎంపీ రఘురామిరెడ్డి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మున్సిపల్ మేయర్ పి నీరజ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఉత్త రా అమెరికా తెలుగు సంఘం తానా మాజీ అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా ఐ జే యు , కార్యదర్శి వై .నరేందర్ రెడ్డి , ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు డి .సోమ సోమ సుందర్ ,ఎంఏ మాజీద్ కల్లూరి సత్యనారాయణ ఆలపాటి సురేష్ కుమార్ పాల్గొంటారని తెలిపారు.

మహాసభల ముగింపు రోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరు అవుతారని తెలిపారు అదేవిధంగా విశిష్ట అతిథిగా కె శ్రీనివాసరెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ గౌరవ అతిథులు బల్విందర్ సింగ్ జమ్ము ఎస్ ఎన్ సిన్ హ, ఐజ యు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ హాజరవుతారని తెలిపారు. ముగింపు సభలోనే రాష్ట్ర టి యు డబ్ల్యూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని వారు తెలిపారు. రాష్ట్ర మహాసభల ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పాత్రికేయుల సమావేశంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ, ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాసరావు, కనకం సైదులు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకటరావు, ఖదీర్ ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అమరవాది రవీంద్ర శేషు, నాయకులు నల్లజాల వెంకటరావు, మురారి, మాటేటి వేణుగోపాల్ , నగర అధ్యక్ష కార్యదర్శులు మైసపాపారావు చెరుకుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి కోమటిరెడ్డి మాజీమంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం….

Ram Narayana

తమ్మినేనిని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి,రెవిన్యూ మంత్రి పొంగులేటి!

Ram Narayana

తుపాను నేపథ్యంలో.. అధికారులకు రేవంత్ రెడ్డి సూచనలు

Ram Narayana

Leave a Comment