Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కమ్యూనిస్టు సిద్ధాంతం మాత్రమే ప్రజల అవసరాలను గుర్తిస్తుంది .. కూనంనేని

మార్క్సిజంతోనే పురోగమనం…శిక్షణా తరగతుల్లో కూనంనేని
సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కార్యాచరణ
ప్రజా సంఘాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి బాగం

మార్క్సిజంతోనే దేశం పురోగమిస్తుంది తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు … కమ్యూనిజం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. శిక్షణా తరగతుల్లో భాగంగా రెండవ రోజున ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సిపిఐ అనే అంశాన్ని కూనంనేని బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పలు అంశాలు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని ప్రజల నిస్పష్ట అభిప్రాయం ఎన్నికల సందర్భంగా బహిర్గతం కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఎన్నికల సందర్భంలోను ఏదో ఒక అంశం రాజకీయాలను ప్రభావితం చేసి గెలుపోటములను నిర్దేశిస్తుందన్నారు. ఒకసారి సానుభూతి ఓట్లు, మరోసారి మతపరమైన ఓట్లు కొన్ని పార్టీలను అధికారంలోకి -తీసుకువస్తున్నాయన్నారు. పాలన పద్ధతులు పేద, అట్టడుగు వర్గాల సంక్షేమం, ఆర్థిక విధానాలు, అభివృద్ధి ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఎజెండా అంశాలుగా రావడం లేదన్నారు. సిద్దాంతం లేకుండా కొన్ని బూర్జువా పార్టీలు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు సిద్ధాంతం మాత్రమే ప్రజల అవసరాలను గుర్తిస్తుందన్నారు. దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయని ఇది తీవ్ర అశాంతికి దారి తీయడంతో పాటు ఆందోళన కలిగిస్తుందని కూనంనేని తెలిపారు. కమ్యూనిజం మాత్రమే ఈ దేశానికి ప్రత్యామ్నాయమని పార్టీని మరింత మరింత విస్తరించాల్సి ఉందని ఆయన తెలిపారు, కమ్యూనిస్టుల అవసరం పెరుగుతున్న -నేపథ్యంలో అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలన్నారు. యువతను పార్టీ వైపు ఆకర్షించాలంటే సంస్థాగత నిర్మాణం ప్రధానమైందని ఒకపక్క “ఆందోళనలు, మరో పక్క సైద్ధాంతిక శిక్షణ, సైద్దాంతిక ప్రచారం పార్టీని బలోపేతం చేయనున్నాయని ఆయన తెలిపారు. సువిశాల భారతదేశంలో కుల, మత, ఆర్ధిక పరిస్థితులకు అతీతంగా ప్రజలందరినీ ఏక దృష్టితో చూడగలిగిన సిద్ధాంతం కమ్యూనిజం మాత్రమే అన్నారు. పార్టీ బలానికి అనుగుణంగా పోరాట కార్యక్రమం రూపొందించబడాలని ఆయన సూచించారు.

ప్రజా సంఘాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి …బాగం

కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే కమ్యూనిస్టు పార్టీ విస్తరణ సాధ్యమవుతుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ తరహాలోనే ప్రజా సంఘాలు దైనందిన కార్యాచరణ రూపొందించుకుని అందుకు అనుగుణంగా పని చేయాలన్నారు. పార్టీ నిర్మాణం పై కేంద్రీకరించి కార్యక్రమాల రూపకల్పన జరిపి అమలు చేయాలని అప్పుడే పార్టీ విస్తరణ సాధ్యమవుతుందన్నారు. రెండవ ఆరోజు సిపిఐ శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం పార్టీ నిర్మాణం నూతన సవాళ్లు అనే అంశాన్ని ఆయన బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూర్జువా పార్టీల విధానాలు అధికారం లక్ష్యంగా పనిచేస్తున్నాయని అధికారం కోసం ప్రజలను వంచిస్తున్నారని ఆయన తెలిపారు. అచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి రావడం, ఇచ్చిన హామీలను మరచిపోవడం జరుగుతుందన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరి కొంత కాలం బూర్జువా పార్టీలతో పొత్తు తప్పక పోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అతి త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని గ్రామ పంచాయితీలు, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, మున్సిపాలిటీలు, సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ప్రతి ఎన్నికలోను బలానికి అనుగుణంగా విజయం సాధించే దిశగా ఆలోచన చేయాలని హేమంతరావు కోరారు. ఈ శిక్షణా తరగతుల్లో పార్టీ కార్యక్రమాలపై సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రసంగించగా శిక్షణా తరగతులకు జమ్ముల జితేందర్రెడ్డి ప్రిన్సిపాల్గా, శింగు నర్సింహారావు వైస్ ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దైనిక్ భాస్కర్ తో పాటు మరో న్యూస్ ఛానల్ పై ఐటీ దాడులు…

Drukpadam

భారత పర్యాటకుల రాకతో పండుగ చేసుకుంటున్న అబుదాబి!

Drukpadam

కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!

Drukpadam

Leave a Comment