ఆంధ్రప్రదేశ్

ఏపీలో మాజీమంత్రుల ఇళ్లపై కొనసాగుతున్న దాడులు …

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం మాజీమంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేకించి వైసీపీకి చెందిన నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి…గతంలో కొడాలి నాని , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర నేతల ఇళ్లపై దాడులు జరగ్గా తాజాగా మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఫెర్రీ నుంచి రింగుకూడలికి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. అయితే, ఆదివారం మధ్యాహ్నం ఆ రహదారిలో కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది ఒకరు వారిని అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులూ రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. అయితే, జోగి రమేశ్ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

పాట్నాలో వచ్చే నెల 12న ప్రతిపక్ష నేతల భేటీ

Drukpadam

గ్రూప్ వన్ అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ దుర్మార్గం …పాతపద్ధతిలోనే పరీక్షా నిర్వహించాలి ..

Ram Narayana

ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌తో అట్టుడుకుతున్నపాకిస్థాన్!

Drukpadam