అందరి దృష్టిని ఆకర్షించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ మహాసభలు
పాల్గొన్న డిప్యూటీ సీఎం ,ఇద్దరు మంత్రులు
మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి
వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన పరిశీలకులు
నూతన అధ్యక్షప్రధాన కార్యదర్శులుగా విరహత్ అలీ ,రాంనారాయణ
11 తీర్మానాలు ఆమోదం…గ్రామీణ విలేకర్లకు వేతనాలు ఇవ్వాలి
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని మహాసభ డిమాండ్
జర్నలిస్టులకు ఇల్లు ,ఇళ్లస్థలు, అక్రిడేషన్ కార్డులు , హెల్త్ కార్డుల కోసం కార్యాచరణ
ఈనెల 19 ,20 తేదీల్లో ఖమ్మంలోని కామ్రేడ్ కె .అమర్ నాథ్ ప్రాంగణంలో (ఉష హరి కన్వెన్షన్) లో జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) మూడవ మహాసభలు అత్యంత జయప్రదంగా జరిగాయి..ఈసభలు వివిధరంగాల ప్రముఖుల దృష్టిని ఆకర్శించాయి…సభలను గురించి అరా తీశారు … సభలో తీసుకున్న నిర్ణయాలు , చేసిన తీర్మానాలు , జరిగిన చర్చలపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ,వివిధ ప్రజాసంఘాలు , పౌరసమాజం జాగ్రత్తగా గమనించడం విశేషం …ప్రత్యేకించి ఖమ్మం నగరంలో చేసిన అలంకరణ ఈసభల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ,రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు , మాజీఎమ్మెల్యే సిపిఐ (మాస్ లైన్ ) పార్టీ నాయకులు గుమ్మడి నర్సయ్య , ఐజేయూ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ , ఎస్ .ఎన్ సిన్హా , తమిళనాడు ,పాండిచ్చేరి శాఖల యూనియన్ అధ్యక్షులు శుభాష్ , మతిమహారాజ్ ,కర్ణాటక అధ్యక్షులు భాస్కర్ రెడ్డి , మహారాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు , శ్రీనివాస్ , ప్రమోద్ , ఛత్తీస్ ఘడ్ శాఖ అధ్యక్షులు రథ్ పాల్గొన్నారు …19 వ తేదీన సభలను రాష్ట్ర సమాచార ప్రసారాల శాఖ, రెవిన్యూ ,గ్రహనిర్మాణాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు …ప్రారంభసభకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి నేషనల్ , రాష్ట్ర , కౌన్సిల్ సభ్యులు , అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు హాజరైయ్యారు …ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు … అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిన ఈసభల్లో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతిత్వరలో జర్నలిస్టులకు తీపి కబురు అందిస్తామని జర్నలిస్టుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు …పెండింగ్ లో ఉన్న ఇళ్లస్థలాల ఫైళ్లను క్లియర్ చేయడంతోపాటు ,రాష్ట్రంలో జర్నలిస్టలందరికి ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఒక పాలసీ తీసుకోని వస్తామని ప్రకటించారు ..అదే విధంగా హెల్త్ కార్డుల విషయంలో ముఖ్యమంత్రిగారితో చెప్పి మీడియా అకాడమీ చైర్మన్ మేము కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు …ఇప్పటికే దీనిపై ప్రాధమిక చర్చలు జరిపామని అన్నారు … గత ప్రభుత్వం చెప్పినట్లు మాటల చెప్పమని చేసి చూపిస్తామని ,ఇది ప్రజల ప్రభుత్వమని ,రాష్ట్రంలో ప్రజలందరికి ఇల్లు లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు ..
మొదటి రోజు రెండవ సెషన్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .విరహత్ అలీ నివేదిక ప్రవేశపెట్టగా దానిపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొని మాట్లాడాడు … కొన్ని తీర్మానాలు ప్రవేశ పెట్టారు ..మీడియా కమిషన్ ఏర్పాటు , జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం , వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్ పునరుద్దరించాలని , వేతన సంఘం నియమించాలని డిమాండ్ చేసింది … ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు నియమించిన వృత్తి కమిటీలను బీఆర్ యస్ ప్రభుత్వం వేయకపోవడాన్ని మహాసభ తప్పు పట్టింది ..తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పునరుద్దరించాలని కోరింది ..అదే విధంగా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలనీ ,హెల్త్ కార్డులు ఇచ్చి అన్ని కార్పొరేట్ హాస్పటల్స్ లో అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, వృద్ధ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం పునరుద్దరించాలని సభ తీర్మానంలో పేర్కొన్నది ..గ్రామీణ విలేకర్లకు ,న్యూస్ ఛానల్స్ లో పనిచేస్తున్న విలేకర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో వేతనాలు అమలు చేయాలనీ తీర్మానించింది …ఉర్దూ పత్రికలకు పెద్ద కేంద్రంగా ఉన్న హైద్రాబాద్ లో వాటిని ప్రోత్సహించాలని ,అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని , కమిటీల్లో స్తానం కల్పించాలని సభ తన తీర్మానంలో డిమాండ్ చేసింది ..
చిన్న పత్రికలను ఆదుకోవాలని , ఎం ప్యానల్ కోసం ఎదురు చూస్తున్న ప్రతికలకు వెంటనే క్లియరెస్ ఇవ్వాలని , రేట్ కార్డు పెంచాలని , ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని మహాసభ విజ్ఞప్తి చేసింది ..జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు , ఇవ్వాలని , గతంలో లాగానే జర్నలిస్టులకు అవార్డులు పునరుద్దరించాలని డిమాండ్ చేసింది ..
రెండవరోజు సమావేశాల్లో సభలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ సమాజహితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు రాసే రాతలు జాగ్రత్తగా ఉండకపోతే సమాజం నష్టపోతుందని అభిప్రాయపడ్డారు …
ఇండియన్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు, మీడియా కమిషన్ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో జర్నలిస్టుల ఉద్యమం , యూనియన్ నిర్మాణంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు …యూనియన్ పటిష్ఠతకు గతంలో తీసుకున్న నిర్ణయాలు , గత 30 -40 సంవత్సరాలుగా సంఘంలో వచ్చిన పెడధోరణులు , వాటిని అధిగమించి సంఘాన్ని పటిష్టం చేసిన తీరును వివరించారు …
ముగింపు సభలో పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛగా పనిచేసేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది హామీ ఇచ్చారు .. భావస్వేచ్ఛకు భంగం కల్గనివ్వమని ఇది తమ ప్రభుత్వ విధానమని ఉద్ఘాటించారు … ప్రజాస్వామ్యంలో నాల్గొవ స్తంభంగా ఉన్న మీడియా రంగాన్ని కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు …మీడియా కమిషన్ ఏర్పాటు , ఉద్యోగ భద్రత , జర్నలిస్టుల సంక్షేమం , ఇళ్ల స్థలాలు , అక్రిడేషన్లు , హెల్త్ కార్డులపై తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు … మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి సూచించిన విధంగా మీడియా భద్రతకు ఒక చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు ..
రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్మూ , ఐజేయూ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ , ఎస్ సిన్హా , ఐజేయూ సెక్రటరీలు వై . నరేందర్ రెడ్డి , డి . సోమసుందర్ , ఐజేయూ కార్యవర్గ సభ్యులు స్క్రైబ్ పత్రిక సంపాదకులు ఆలపాటి సురేష్ , మరో కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ ,ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శలు ఐ వి సుబ్బారావు , చందు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు …
ఖమ్మం జిల్లా యూనిట్ టీం వర్క్ …ప్రసంశనీయం
ఖమ్మంజిల్లా కమిటీ ఈ మహాసభలకు విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లా యూనిట్ చేసిన టీం వర్క్ ప్రశంశనీయమని రాష్ట్ర ,జాతీయనాయకత్వం అభినందించింది … ఎటువంటి లోటుపాట్లు లేకుండా మహాసభలను విజయవంతంగా నిర్వహించింది. నెల రోజుల పాటు 70 మంది జర్నలిస్టులు ఆహర్నీశలు కష్టపడి మహాసభలను విజయవంతం చేశారు. రాంనారాయణ నేతృత్వంలో అధ్యక్షులుగా కూరపాటి ప్రదీప్ కుమార్, కార్యదర్శిగా వనం వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఏనుగు వెంకటేశ్వరరావు మరో 36 మందితో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఎనిమిది సబ్ కమిటీలను ఏర్పాటు చేసి ఒక్కో కమిటీలో ఐదారుగురు సభ్యులు ఈ మహాసభల విజయవంతానికి కృషి చేశారు. జిల్లా ఎలక్ట్రానిక్మీడియా అసోసియేషన్ ఖమ్మం నియోజక వర్గ యూనియన్, టియుడబ్ల్యూజె వైరా యూనిట్లు మహాసభలకు పూర్తి స్థాయిలో సహకరించాయి …
మహాసభల జయప్రదానికి కృషి చేసిన వారిలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నేర్వనేని వెంకట్రావు ,(స్వతంత్ర టీవీ) , నలజాల వెంకట్రావు (ఆంధ్రజ్యోతి) ఖదీర్ (వి 6 టీవీ ) )మైసా పాపారావు (ఆంధ్రప్రభ ) సామినేని కృష్ణ మురహరి (మన తెలంగాణ ) ఆవుల శ్రీనివాస్(సివిఆర్ న్యూస్ )కనకం సైదులు (10 టీవీ ) మహేందర్ (సాక్షి టీవీ ), అయ్యప్ప (6 టీవీ ) మొహినుద్దీన్ (వార్త ) నామ పురుషోత్తం (మనం ) చెరుకుపల్లి శ్రీనివాస్ (99 టీవీ ) కెవి (వి 5 టీవీ ) మేడి రమేష్(సూర్య ) ,కళ్యాణ్ (ముద్ర న్యూస్ ) ఏలూరి వేణుగోపాల్ తాళ్లూరి మురళి ,జనార్దనాచారి (నవభూమి) నాగెళ్ల శివానంద (జనతా ) మధులత.ఎలక్ట్రానిక్ మీడియా వీడియో జర్నలిస్ట్ సంఘ నాయకులు (ఆలస్యం అప్పారావు , టీవీ 9 ) జకీర్ (టీవీ 5 ) అంజి (ప్రజాపక్షం ఫోటో జర్నలిస్ట్ ) నాగరాజు (ఫ్రీలాన్సర్ ఫోటో జర్నలిస్ట్) అశోక్ ( ఫోటో జర్నలిస్ట్ ) తదితరులు ఉన్నారు ….