టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నేడు ఏపీ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే, స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు, నేడు జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి జగన్ పులివెందుల వెళ్తారు. మూడు రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు.