Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణాలో ఐదుగురు పోలీస్ సర్కిల్ ఇన్సపెక్టర్లపై చర్యలు ….పోలీస్ శాఖలో కలకలం

గతప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు నమోదు ,అధికారపార్టీ నేతల మెప్పుకోసం వారు ఏది చెపితే అదిచేసిన అధికారులపై వేటు వేయడం పోలీస్ శాఖలో కలకలం రేపింది …ఉద్యోగరీత్య అధికార పార్టీ నేతలు మంత్రులు చెప్పినట్లు నడుచుకుంటే ఇంతే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…వివరాల్లోకి వెళ్లితే …

మల్టీ జోన్ 1 పరిధిలోని అవినీతికి పాల్పడి నందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాటరాయళ్ళకు సహకరిస్తూ, జూదగృహలను ప్రోత్సాహిస్తూ అవినీతి కి పాల్పడుతున్న సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశం తో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు నమోదు చేసినందుకుగాను ఇదే కమిషనరేట్ లో గతంలో పని చేసి ప్రస్తుతం ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న సి. హెచ్ శ్రీధర్ ఇన్స్ స్పెక్టర్ సస్పెండ్ చేయడంతో పాటు, మతకల్లోల
సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు మెదక్ పట్టణ, రూరల్ ఇన్స్ స్పెక్టర్లు ఎస్. దిలీప్ కుమార్ బి. కేశవులను అలాగే అధికార పర్యవేక్షణ లోపించినందుకు గాను భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బి. రాజేశ్వర్ రావు ను మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయం కు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏ. వి. రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాట కేంద్రాలు నిర్వహిస్తునట్లుగా పోలీస్ ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆదేశాల మేరకు పేకాట కేంద్రాలపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన పేకాటారాయుళ్ల ను అరెస్ట్ చేసి విచారించిగా సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశం ముందుస్తుగానే పోలీసుల దాడులకు సంబంధించి పేకాట కేంద్రాల్లోని పేకాటారాయుళ్లకు సమాచారం ఇవ్వడంతో పేకాట కేంద్రాలను పొత్సహించేవాడని ఇందుకు సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశంకు ఆర్ధికంగా లాభం చేకూర్చడం జరుగుతుందని అధికారుల విచారణలో నిర్ధారణ కావడంతో సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మరో ఘటనలో ఇదే కమిషనరేట్ పరిధిలో ఖమ్మం పట్టణంలో 2022-23 మధ్య కాలంలో ఖమ్మం 2 టౌన్ ఇన్స్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సి. హెచ్ శ్రీధర్ స్థానిక విలేకరి ఇంటి లో ఎస్. ఎల్. ఆర్ తుపాకీ సంబంధించిన ఆరు తుటాలు లభ్యమైనట్లు ఆయుధాల చట్టంతో పాటు పలు సెక్షన్లతో బెదిరించి పంచులతతో పంచానామాలో సంతకాలు చేయించి తప్పుడు కేసు నమోదు చేయడంతో పాటు, 2022 సంవత్సరంలో క్రైం నంబర్ 310 లో 420 సెక్షన్ క్రింద నమోదైన కేసులో ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ నిందితుడికి అనుకూలంగా వ్యవహారిస్తూ కేసు దర్యాప్తు స్థితి గతులు తెలిపే యూ. ఐ కేసుల జాబితా లో కూడా సదరు కేసును లేకుండా చేసి, ఈ కేసు పూర్తిగా సివిల్ తగాదా పరిధిలోకి వస్తుందని కోర్టు ను తప్పు దోవ పట్టించినట్లుగా ఇన్స్ స్పెక్టర్ పై ఫిర్యాదు రావడంతో ఖమ్మం సిపి విచారణ జరిపి అందజేసిన నివేదిక లో ఇన్స్ స్పెక్టర్ అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పోలీసుల గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించినందుకు ప్రస్తుతం ములుగు జిల్లా లో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్ స్పెక్టర్ సిహెచ్ శ్రీ ధర్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వులను జారీ చేశారు.

మరో ముగ్గురు ఇన్స్ స్పెక్టర్ల స్థాయి అధికారులను మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్

ఇటీవల మెదక్ జిల్లా పరిధిలో జరిగిన మతకల్లోల సమయంలో మెదక్ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ల చెందిన ఇన్స్ స్పెక్టర్లు ఎస్. దిలీప్ కుమార్,బి. కేశవులు మతకల్లోలాలు జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వహించినందుకు గాను మెదక్, పట్టణ, రూరల్ ఈ ఇన్స్ స్పెక్టర్ల తో పాటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ కేసు వ్యవహారంలో సర్కిల్ ఇన్స్ స్థాయిలో ఎస్. ఐ పనితీరు, వ్యవహార శైలిపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మహదేవ్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బి. రాజేశ్వర్ రావును మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయంకు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జీ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు.

Related posts

బీఆర్ యస్ మాజీ ఎమ్మెల్యే కందాలపై భూకబ్జా కేసు …

Ram Narayana

కవిత విషయంలో కేసీఆర్ ప్లాన్ బెడిసి కొట్టిందా …?

Ram Narayana

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా నివేదిక!

Ram Narayana

Leave a Comment