Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

నేడోరేపో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ…శాఖల మార్పు జరిగే అవకాశం…

అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది …సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయ్యారు దీంతో విస్తరణ నేడో రేపో ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి…ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణపై ఏఐసీసీ నేతలతో సంప్రదింపులు జరిపారు …దీంతో ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై ఒక క్లారిటీకి వచ్చారు …18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ఇప్పటివరకు 12 మంది మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు …మరో 6 గురిని మంత్రులుగా తీసుకునే ఛాన్స్ ఉంది …దీంతో ఆ ఆరుగురు ఎవరు అనేది ఆసక్తిగా మారింది ..కాంగ్రెస్ టికెట్ పై గెలుపొందినవారికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని అంటున్న హైద్రాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు వస్తుంది …మంత్రులుగా ఉన్న వారి శాఖల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు … ఇప్పటివరకు కొన్ని శాఖలకు మంత్రులు లేరు …ముఖ్యమంత్రే వాటిని చూస్తున్నారు …హోమ్ శాఖ సీతక్క దక్కే ఛాన్స్ ఉండవచ్చు …

మంత్రి సీతక్కకు హోంశాఖ పదవి వచ్చే అవకాశముందని, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు.

కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖలను మార్పులు చేర్పులు చేసే అవకాశముందన్నారు. కొత్తగా ఐదారుగురికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్‌కు కేబినెట్లో చోటు దక్కే అవకాశముందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కువచ్చునన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన చేస్తామన్నారు.

Related posts

తెలంగాణ సచివాలయం సమీపంలో కారు దగ్ధం

Ram Narayana

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ …పంటల బీమా పథకం అమలుకు కసరత్తు…

Ram Narayana

నేను బీజేపీలో చేరానంటే చాలామందికి ఆశ్చర్యం వేయవచ్చు కానీ..: జయసుధ

Ram Narayana

Leave a Comment