Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం.. ప్రదానం చేసిన పుతిన్…

  • రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
  • ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ పురస్కారం అందించిన రష్యా ప్రభుత్వం
  • భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపు

రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి విశిష్ట ఘనత లభించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత అవార్డును అందించినట్టు పుతిన్ పేర్కొన్నారు. 

దీనిపై మోదీ స్పందించారు. తనకు రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ అవార్డును నా దేశ 140 కోట్ల మంది ప్రజలకు అంకితం ఇస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. 

Related posts

ఈ దేశాల్లో నేరాలు అతి తక్కువ..!

Ram Narayana

స్విట్జర్లాండ్ లో బుర్ఖా వేసుకుంటే ఫైన్

Ram Narayana

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్యం సాధించిన షూటర్ మను భాకర్!

Ram Narayana

Leave a Comment