కొత్త న్యాయ చట్టాల అమలు తో న్యాయ సంక్షోభం
మాస్ లైన్ సెమినార్
ప్రొఫెసర్ మురళీ కర్ణ
జూన్ 1 నుంచి అమలవుతున్న నూతన నేర చట్టాలు వల్ల దేశంలో న్యాయ సంక్షోభం పెరిగిపోతుందని పౌర ప్రజాస్వామ్యక హక్కులు అణిచివేయబడతాయని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురళీ కర్ణం అన్నారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ లో జరిగిన సెమినార్లు ఆయన ముఖ్య అతిగా పాల్గొని ప్రసంగిస్తూ ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులను సస్పెండ్ చేసి నేర చట్టాలు ఆమోదింప చేశారని వీటి పై సమగ్రమైన చర్చ వివరణలు విశ్లేషణ లేకుండా అమలు చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు .నేరాలకు సామాజిక ఆర్థిక పరిస్థితులు కారణమవుతాయని విషయాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తులకు విచక్షణ అధికారాన్ని గత చట్టాలు కట్టభేడితే ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా చేశారని అన్నారు. పాలనలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం కేంద్రా ఉండబట్టే ఇలాంటి చట్టాలను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు . జీవించే హక్కును, పౌర స్వేచ్ఛను కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తిని ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కొన్ని సెక్షన్లు కఠినతరం చేశారని ఆయన అన్నారు పాలకులకు నిరంకుశ అధికారాన్ని కట్టబెట్టే చట్టాలు అమల్లోకి వస్తే పౌర ప్రజాస్వామిక స్వేచ్ఛ హక్కులు కూడా ఖననం చేయబడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాజ ద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే దొడ్డిదారిన దేశద్రోహం చట్టం పేరు మీద ప్రవేశపెట్టారని ఈ చట్టం దేశ పౌరు ప్రజాస్వామిక సంస్థలపై ఎలా అమలు చేయనున్నారు మనకి ఇట్లే అర్థమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సమగ్రంగా చర్చించకుండా ప్రతిపక్షాలతో చర్చలు చేయకుండా న్యాయవాద సంఘాలు సంస్థలతో మాట్లాడకుండా ఈ నిరంకుశ చట్టాలు తీసుకురావడం తో న్యాయ సంక్షోభం పెరిగిద్దమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎఫ్ఐఆర్ నమోదుకు 14 రోజుల సమయం తీసుకోవడం, 14 సంవత్సరాలు శిక్ష ఉన్న యావ జీవవ కారాగార శిక్ష జీవిత ఖైదీగా మార్చి వేయడం. నిందితులు బైలు పొందటానికి అనేక ఆటంకాలు సెక్షన్లు తీసుకొచ్చారని ఆయన అన్నారు విస్తృత చర్చలు జరపాలని ఆయన పేర్కొరారు అనంతరం ఈ సభలో సీనియర్ న్యాయవాది. కొల్లి సత్యనారాయణ v కృష్ణమూర్తి k రవి clc సంఘం నాయకులు ఓరుగంటి శేషగిరి గారు మాస్ లైట్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు ఆవుల అశోక్ సిఎల్సి జిల్లా కార్యదర్శి పావెల్ జిల్లా ఉపాధ్యక్షుడు శిరీషాలు ప్రసంగించగా డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు మంగతాయి శిరోమణి శోభ కే శ్రీను సురేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు