Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలి ఉంది …మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలి ఉంది …మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి
బీఆర్ యస్ ఖాళీ ఖాయం …హరీష్ రావు బీజేపీలోకి
అవినీతి పరులకు కాంగ్రెస్ లో చోటులేదు

బీఆర్​ఎస్​ను ఓడించాలనే మొదటి లక్ష్యం నెరవేరిందని, కేసీఆర్‌ను జైలుకు పంపాల్సిన లక్ష్యం నెరవేరాల్సి ఉందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వెల్లడించారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు …బీఆర్ యస్ లో అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఇంకా చేరేవారి సంఖ్యా బాగానే ఉందని పేర్కొన్నారు ..పార్టీల మార్పుపై మాట్లాడుతూ గతంలో కేసీఆర్ చేసింది ఏమిటి …? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోలేదా …అని ప్రశ్నించారు …పార్టీ మార్పులపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ యస్ నేతలకు లేదని అన్నారు …

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉండదు. తప్పకుండా కాంగ్రెస్​ పార్టీయే ఇంకా పదేళ్లు అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ ఖాళీ అవటం ఖాయం, హరీశ్​రావు సైతం బీజేపీలో చేరుతారు. ఇంకా జగదీశ్​ రెడ్డి యాదాద్రి పవర్​ ప్లాంట్​ విషయంలో అవినీతి చేశారు. ఇంక ఆయన జైలుకు వెళ్లటం పక్కా. అవినీతి ఆరోపణలు ఉన్న బీఆర్ఎస్ నేతలను ఎవరినీ మా పార్టీలోకి తీసుకోమని కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు.

Related posts

రాహుల్ గాంధీ గారూ! మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా?: కేటీఆర్ ప్రశ్న

Ram Narayana

బ్రేకులు ఫెయిల్ కావడంతో ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన బస్సు.. విజయవాడలో ముగ్గురి మృతి

Ram Narayana

తెలంగాణలో 11 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్!

Ram Narayana

Leave a Comment